కెప్టెన్‌గా రుతురాజ్.. జట్టులోకి రింకూ సింగ్
ఆసియా క్రీడల్లో పోటీ పడే భారత పురుషుల క్రికెట్ జట్టుకు సీఎస్కే ఆటగాడు, యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చైనాలోని హాంగ్జౌ వేదికగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఇందులో పాల్గొనే జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టు మొత్తం ఐపీఎల్ యంగ్ స్టార్లతో నింపేసింది. ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకూ సింగ్, జితేశ్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్ తొలిసారి భారత జట్టులో చోటు సంపాదించుకున్నారు. ఇక వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఇప్పటికే ఎంపికైన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ కూడా ఇందులో చోటు దక్కించుకున్నాడు.
ధావన్ కెరీర్ ముగిసినట్లేనా?
సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఈ జట్టుకు సారథిగా ఉండనున్నాడని నిన్నటి వరకు వార్తలు వచ్చాయి. అయితే సెలెక్టర్లు మాత్రం ధావన్ ను పక్కన పెట్టి రుతురాజ్ కు అవకాశం ఇచ్చారు. ఇప్పటికే సీనియర్ల జట్టుకు గబ్బర్ దూరమయ్యాడు. ఇప్పుడు ద్వితీయ శ్రేణి జట్టుకు కూడా ఎంపిక చేయకపోవడంతో ధావన్ క్రికెట్ కెరీర్ ముగిసినట్లేనని మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు.
ఉమెన్స్ జట్టులోకి తెలుగమ్మాయిలు..
మరోవైపు సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు జరిగే మహిళల టీ20 పోటీలకూ జట్టు ప్రకటించింది. హర్మన్ ప్రీత్ సారథిగా వ్యవహరించే ఈ జట్టులో తెలుగు అమ్మాయిలు అంజలి శర్వాణి, బారెడ్డి అనూష చోటు సంపాదించారు.
పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (C),యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ(WK),వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (WK)
స్టాండ్‌బై ప్లేయర్లు: సాయి సుదర్శన్, యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా
మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (WK),అమన్ జోత్ కౌర్, దేవిక వైద్య, అంజలి శర్వాణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రీ (WK), బారెడ్డి అనూష
స్టాండ్‌బై ప్లేయర్లు: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్