BC Leader Rajaram: ఎన్నికల సమయంలో అధికారంలో రాగానే బీసీ కులగణన చేపడుతామని ఆనాడు స్వయంగా కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారని గుర్తు చేశారు బీసీ జనసభనేత రాజారామ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అసలు కులగణన ఊసే ఎత్తడం లేదని సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. గత పదేళ్లుగా దేశంలో కులగణన అనేదే లేకుండా పోయిందని.. కులగణన చేయకుండా బీసీలకు ఏ ప్రకారంగా రిజర్వేషన్లు ఇస్తారు అని అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు.
అసలు కులగణన ఎందుకు చేపట్టాలి, కులగణన ఇప్పుడు ఎందుకు అంత అవసరం?, చేయడం అంత అవసరమా?, బీసీ కులగణన చేయడం ద్వారా బీసీల్లో ఉన్న అన్ని కులాల్లో చిచ్చు పెట్టదా? అనే అంశాలపై తొలి వెలుగుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీసీ జనసభనేత రాజారామ్ విశ్లేషణ ఇచ్చారు. పూర్తి ఇంటర్వ్యూను కింద వీడియోలో చూడండి.