Savings Account: బేసిక్ సేవింగ్స్ ఎకౌంట్.. మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు.. వివరాలివే 

ఎకౌంట్ లో మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించడం కష్టంగా ఉండే వారి కోసం ఆర్బీఐ కొత్త సేవింగ్స్ ఎకౌంట్ BSBDA అంటే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఎకౌంట్ తీసుకువచ్చింది

Super Scheme: కేవలం రూ. 65 పొదుపు చేస్తే మీ అకౌంట్లోకి రూ. 16లక్షలు. సర్కార్ అదిరిపోయే స్కీమ్..పూర్తివివరాలివే..!!
New Update

చాలా మందికి,  బ్యాంకులో సేవింగ్స్ ఎకౌంట్ (Savings Account)ను  నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే, దీనికి కొంత మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయడం  అవసరం. తక్కువ జీతం పొందే లేదా ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇలా మినిమమ్ బేలెన్స్ మెయింటెయిన్ చేయడం  సాధ్యం కాదు. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా BSBDA అంటే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఎకౌంట్ ముందుకు వచ్చింది. తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి వారు సంపాదించిన డబ్బును డిపాజిట్ చేయడానికి సురక్షితమైనప్లేస్ కోరుకుంటారు. ఇక్కడే ఈ సేవింగ్స్ ఎకౌంట్ సహాయపడుతుంది.

BSBDA అంటే ఏమిటి?

బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా లేదా BSBDA అనేది కనీస బ్యాలెన్స్ అవసరం లేని సేవింగ్స్ ఎకౌంట్(Savings Account). కానీ ఈ (నో-ఫ్రిల్స్ జీరో బ్యాలెన్స్) ఎకౌంట్ లో గరిష్ట మొత్తం రూ. 50 వేలు అలాగే 1 సంవత్సరంలో ఈ ఖాతాలో చేసిన మొత్తం క్రెడిట్ గరిష్ట పరిమితి రూ. 1 లక్షరూపాయలు మాత్రమే ఉండాలి. అలాగే, ఈ ఎకౌంట్స్ లో, ఎటువంటి ఫీజు చెల్లించకుండా నెలలో 4 సార్లు మాత్రమే డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.  ఆ తర్వాత నిర్ణీత ఫీజు చెల్లించాలి. అదే సమయంలో, ఒక నెలలో నగదును విత్‌డ్రా చేయడానికి.. ట్రాన్స్ఫర్  చేయడానికి మొత్తం రూ.10,000గా నిర్ణయించారు. ఈ షరతులు నెరవేరకపోతే, బ్యాంక్ దానిని సాధారణ పొదుపు ఖాతాగా మార్చే అధికారం కలిగి ఉంటుంది. 

ఇందులో మంచి  విషయం ఏమిటంటే, భారతీయ పౌరులు ఎవరైనా BSBDA ఖాతాను తెరవవచ్చు. దీనికి వయసు, డబ్బు అనే పరిమితి లేదు. ఖాతాను సింగిల్ లేదా జాయింట్‌గా తెరవవచ్చు. కానీ దానితో పాటు కొన్ని నిబంధనలు - షరతులు ఉన్నాయి. అయితే, నిబంధనలు - షరతులు బ్యాంకును బట్టి మారవచ్చు.

Also Read: దీపావళికి కారు కొంటున్నారా? ఈ గ్యాడ్జెట్స్ పై ఓ లుక్కేయండి.. 

ఈ ఎకౌంట్ నియమాలు.. 

  • ఒకరికి ఒక BSBDA ఎకౌంట్ మాత్రమే ఓపెన్ చేసుకునే వీలుంటుంది. ఒక వ్యక్తి ఒక బ్యాంకులో ఒక BSBDA ఖాతాను మాత్రమే నిర్వహించగలరు. ఖాతా తెరిచే వ్యక్తి(Savings Account) దీనికి అఫిడవిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
  • BSBDA ఖాతాదారుడు బ్యాంకులో ఏ ఇతర పొదుపు ఖాతాను తెరవడానికి అర్హులు కాదు. ఒక కస్టమర్‌కు ఆ బ్యాంకులో ఏదైనా ఇతర పొదుపు ఖాతా ఉంటే, అతను/ఆమె దానిని BSBDA తెరిచిన తేదీ నుంచి 30 రోజులలోపు మూసివేయాలి.
  • అధికారిక ధ్రువీకరణ పత్రం అంటే ఆధార్ వంటిది లేనప్పటికీ ఖాతాను తెరవవచ్చు, అయితే KYC ప్రక్రియను 12 నెలల్లోపు పూర్తి చేయాలి.
  • KYC కోసం ఎటువంటి పత్రాలు లేకపోయినా, ఫారమ్‌లో వ్రాసిన ఫోటో మరియు వివరాల ఆధారంగా ఖాతా తెరవవచ్చు.  కానీ అతను ఒక సంవత్సరంలోపు KYC పత్రాలను రెడీ చేసి సమర్పించాలి. ఖాతా ఓపెన్ చేసేవారు వృద్ధుడు అయితే, సంతకం చేయలేకపోతే, అతను ఫోటో -  బొటనవేలు ముద్ర ఆధారంగా లావాదేవీని చేయవచ్చు. ఖాతాను(Savings Account) తెరవడానికి ఎటువంటి హామీ అవసరం లేదు, కానీ ఖాతాను తెరిచే సమయంలో సాక్షి తప్పనిసరిగా ఉండాలి.
  • వ్యక్తిగత పాస్‌పోర్ట్, ఓటర్ ID కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, NREGA కార్డ్, జాతీయ జనాభా రిజిస్టర్ ద్వారా జారీ చేసిన లేఖ వంటి పత్రాలను ఎడ్రస్ ప్రూఫ్ గా ఇవ్వవచ్చు.

సురక్షిత లావాదేవీ 

BSBDA ఖాతా ఇతర ఖాతాల(Savings Account) వలె పని చేస్తుంది. మీరు ATM, UPI, చెక్కు మొదలైన వాటిని ఉపయోగించి నగదు తీసుకోవచ్చు. కానీ బ్యాంకింగ్ మోసాలను అరికట్టేందుకు రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన చెక్కులకు 'పాజిటివ్ పే సిస్టం'ను అమలు చేస్తారు.  దీని కింద చెక్కు డ్రా చేసే వ్యక్తి ఎలక్ట్రానిక్ రూపంలో ఆ చెక్కుకు సంబంధించిన సమాచారాన్ని బ్యాంకుకు ముందుగానే అందజేయాల్సి ఉంటుంది. 

Watch this special video:

#rbi #savings-account
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe