TG: బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న ఆందోళన.!

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. వసతుల కల్పన, రెగ్యులర్ వీసీని నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పర్మనెంట్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ధర్నా చేస్తున్నారు.

New Update
TG: బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న ఆందోళన.!

Nirmal District: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో నాలుగవ రోజు విద్యార్ధుల నిరసన కొనసాగుతుంది. అసమర్థ ఇంచార్జి వీసీ వెంకట రమణను తక్షణమే తొలగించి.. యూనివర్సిటికి నూతన వీసీనీ నియమించాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన వెంకట రమణ మీద విజిలెన్స్ ఎంక్వాయిరీకీ ముఖ్యమంత్రి వెంటనే అదేశించాలన్నారు.

Also Read: దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర మళ్లీ రచ్చ..!

వాస్తవాలు తెలియకుండా వెంకట రమణ అక్రమాలకు వంత పాడుతున్న ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేపట్టారు. బాసర ట్రిపుల్ ఐటీలో పర్మనెంట్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు