తెలంగాణ ఎన్నికల్లో (Telangna Elections 2023) సైలెంట్ గా మొదలై సంచలనంగా మారింది బర్రెలక్క (Barrelakka) జర్నీ. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులతో పాటు అన్ని వార్గాల నుంచి ఆమెకు అపూర్వ మద్దతు లభిస్తోంది. ఇటీవల ఆమె సోదరుడి జరిగిన దాడిని పార్టీలకు అతీతంగా ఖండించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) లాంటి అగ్ర నేతలు కూడా దాడిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. బర్రెలక్కకు సెక్యూరిటీ కల్పించాలని హైకోర్టు (TS High Court) సైతం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. బర్రెలక్క ప్రచారం ప్రధాన పార్టీలకు ఏ మాత్రం తీసిపోకుండా సాగుతోంది.
ఇది కూడా చదవండి: RYTHU BANDHU: తెలంగాణ రైతులకు అలర్ట్.. ఆ ఒక్కరోజే అందరి ఖాతాల్లోకి రైతుబంధు?
పాటలు, డప్పులు, డ్యాన్సులు, నినాదాలతో బర్రెలక్క ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఆమె అభిమానులు, మద్దతుదారులు. బర్రెలక్క విజయం కోసం రోజుకో కొత్త పాట విడుదల అవుతోంది. తెలంగాణ ఎన్నికల్లో హైలెట్ గా నిలిచిన రామక్క పాటను బర్రెలక్క కోసం మార్చి పాడుతున్నారు ఆమె అభిమానులు. దీంతో బర్రెలక్క రామక్క పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బర్రెలక్క ప్రచారం సాగుతున్న తీరు ప్రధాన పార్టీల అభ్యర్థులను కలవరపెడుతోంది. బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వస్తాయి? అవి ఏ పార్టీకి గండి కొడతాయి? ఎవరి గెలుపును రివర్స్ చేస్తుంది? అన్న చర్చ కొల్లాపూర్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.