Banks Merger News: కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా బ్యాంకులను విలీనం చేసింది. ఇప్పడు మరికొన్ని బ్యాంకులను విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నాలుగు బ్యాంకులను విలీనం చేయాలనీ నిర్ణయించారనీ.. ఆ దిశలో కేంద్రం వేగంగా అడుగులు వేస్తోందనీ పేర్కొంటూ ఒక డాక్యుమెంట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. దీని ఆధారంగా నాలుగు బ్యాంకుల విలీనం తప్పదనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ డాక్యుమెంట్ ఎక్కడిది అనే వివరాలు తెలియడంలేదు. అయితే, దీని ప్రకారం చూస్తే కేంద్రం యూనియన్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను విలీనం చేయాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Banks Merger News: సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న డాక్యుమెంట్ కేంద్ర ఆర్ధిక శాఖ జారీ చేసినట్టుగా ఉంది. దీని ప్రకారం విలీన ప్రక్రియ కోసం ఆ నాలుగు బ్యాంకులతోనూ జనవరి నెలల్లో పార్లమెంటరీ కమిటీ చర్చలు జరిపే అవకాశం ఉంది. బ్యాంకింగ్ చట్టాల ప్రకారం విలీనం సజావుగా జరిపేందుకు చర్చలు జరపబోతున్నట్టు ఆ డాక్యుమెంట్ ద్వారా తెలుస్తోంది.
Also Read: ఓయో రూములు అంటే.. ఓహొయ్ అంటున్న హైదరాబాదీలు.. దేశంలోనే ఎక్కువగా..
Banks Merger News: యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలతో రెగ్యులేటరీ మెకానిజం, పోస్ట్ మెర్జర్ అంశాలపై చర్చించడం కోసం పార్లమెంటరీ కమిటీ సభ్యులు వస్తున్నట్టు ఒక లేఖను కేంద్ర ఆర్ధిక శాఖ రాసింది. దీనిని నాలుగు ప్రభుత్వ బ్యాంకుల అధినేతలు, ఆర్బీఐ గవర్నర్ కు పంపించారు. ఈ లెటర్ డిసెంబర్ 14న రాసినట్టు ఉంది. ఈ లెటర్ కాపీ ప్రస్తురాటం సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది. యూనియన్ బ్యాంక్ ఇప్పటికే ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులను విలీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యాంక్ యూకో బ్యాంక్ తో విలీనం కావచ్చని సమాచారం. యూకో బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ కోల్‌కతా.
Banks Merger News: అయితే, ఈ విషయంపై ఆర్ధిక శాఖ వివరణ ఇచ్చింది. ఈ లెటర్ నుంచి విలీనం అనే పదాన్ని తొలగిస్తున్నట్టు చెప్పింది. ఈ బ్యాంకులలో ఒక బ్యాంకుకు చెందిన అధికారి ఒకరు బ్యాంకుల విలీనంపై ఇప్పటివరకూ ఎటువంటి చర్చలు జరగలేదని చెప్పారు. ఆర్ధిక శాఖ ఇచ్చిన లెటర్ ను ప్రజలు తప్పుగా అర్ధం చేసుకున్నారని, కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా బ్యాంకుల విలీనంపై పార్లమెంటరీ కమిటీ చర్చలు జరిపే అవకాశం లేదనీ ఆయన చెప్పుకొచ్చారు. ఆ లెటర్ లో ఉన్న పోస్ట్ మెర్జర్ అనే పదాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారని ఆయన అంటున్నారు. ఇది 2020లో విలీనం అయినా నాలుగు అతి పెద్ద బ్యాంకులు ఒరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకు- అలాగే సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంకు- . అలహాబాద్ బ్యాంకు ఇండియన్ బ్యాంకు- ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు సంబంధించిన విలీనం తరువాత పరిస్థితులపై వచ్చిన లెటర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందని ఆయన వివరించారు.
Watch this interesting Video: