కాంగ్రెస్ పాలనలో బ్యాంకులు లూటీ అయ్యాయి : అనురాగ్ ఠాకూర్!

కాంగ్రెస్ నాయకులు తమ హయాంలో వారి ప్రయోజనాలకోసం బ్యాంకులు లూటీ చేశారని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు 12 బ్యాంకుల్లో 11 బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయని ప్రస్తుతం ఇప్పుడ ఆ బ్యాంకులు నికర లాభాల్లో ఉన్నాయని వెల్లిడించారు.

కాంగ్రెస్ పాలనలో బ్యాంకులు లూటీ అయ్యాయి : అనురాగ్ ఠాకూర్!
New Update

కాంగ్రెస్ హయాంలో బ్యాంకులు లూటీ అయ్యాయని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు 12 బ్యాంకుల్లో 11 బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయని ప్రస్తుతం ఇప్పుడ ఆ బ్యాంకులు నేడు నికర లాభాల్లో ఉన్నాయని వెల్లిడించారు.

చండీగఢ్‌ బీజేపీ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు 12 బ్యాంకుల్లో 11 బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయి. మూతపడే దశలో ఉన్న మొత్తం 12 బ్యాంకులు నేడు నికర లాభాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ, బ్యాంకుల లాభమే రూ.60 వేల కోట్లకు చేరింది. కాంగ్రెస్ హయాంలో తమ  ప్రయోజనాల కోసం బ్యాంకులను లూటీ చేశారని ఆయన ఆరోపించాడు.

నేడు పేదల సంక్షేమం కోసం ముద్ర యోజన పథకాన్ని ప్రారంభించారు. 30 ఏళ్లలో కాంగ్రెస్ ఇచ్చిన దానికంటే ఎక్కువే ఇచ్చామని రైల్వే బడ్జెట్ చూస్తే తెలిసిపోతుంది. మన పాలనలో రోడ్లు, రైల్వేలు, విద్య, వైద్యం అభివృద్ధికి ఎన్నో నిధులు కేటాయించారు. అభివృద్ధి చెందిన దేశం కొత్త శకాన్ని సృష్టించడం ద్వారా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఈ విధంగా ఆయన మాట్లాడారు.

#anurag-thakur
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe