Nizamabad: దొంగతనం చేయడం అంత వీజి కాదు. ఏమాత్రం తేడా కొట్టినా...ఊచలు లెక్కలు పెట్టాల్సిందే. అచ్చం అలాగే ఘటనే జరిగింది నిజామాబాద్ జిల్లాలో. ధర్పల్లిమండలంలోని దుబ్బాక(Dubbaka)లో ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకు (Indian Overseas Bank) ఉంది. అందులో దొంగతనానికి యత్నించాడు ఓ దొంగ. బ్యాంకులో దొంగతనం చేయాలంటే కేవలం తాళాలు పగలకొడితే సరిపోదు..కాస్తంత తెలివికూడా ఉపయోగించాలని ఆ దొంగకు తెలియదు పాపం. బ్యాంకులో ఎలాంటి భద్రత ఉందో కూడా తెలుసుకోకుండా దొంగతనానికి వచ్చిన ఇరుక్కుపోయాడు. సీసీ కెమెరాలు, ఎమర్జెనసీ సైరన్ లతో బ్యాంకులకు పకడ్బందీ భద్రత ఏర్పాట్లు ఉంటాయన్న సంగతి తెలియదు కావచ్చు. దర్జాగా దోచుకుందామని వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు. బ్యాంకులోకి దూరి...పోలీస్ స్టేషన్ పాలయ్యాడు.
ధర్పల్లి మండలంలోని ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకులోకి చొరబడ్డాడు దొంగ. అయితే ఒక్కసారిగా సైరన్ మోగింది. దీంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో స్థానికులు కూడా అలర్ట్ అయ్యారు. పారిపోయేందుకు వీలు లేకుండా బ్యాంకు మెయిన్ గేట్ కు తాళం వేశారు. దీంతో బయటకు వచ్చేందుకు దారి లేక దొంగ బ్యాంకులోనే ఉండిపోయాడు. హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాంకు లోపల ఉన్న దొంగను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇది కూడా చదవండి: సింగరేణిలో ముగిసిన సీఎండి శ్రీధర్ శకం…నూతన సీఎండీగా బలరాంకు అదనపు బాధ్యతలు.!!