Bank Robbery: సైలెంట్ గా వచ్చాడు.. కత్తి తీశాడు.. దోచుకెళ్లాడు.. షాకింగ్ వీడియో..! పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం SBI బ్రాంచ్ లో దుండగుడు హల్ చల్ చేశాడు. క్యాషియర్ కనకదుర్గ ను కత్తితో బెదిరించి రూ. 6.50 లక్షలు నగదు ఎత్తుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన బ్యాంకుకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. By Jyoshna Sappogula 01 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Bank Robbery in Narasapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం SBI బ్రాంచ్ లో ఓ దుండగుడు హల్ చల్ చేశాడు. ఫేస్ కు మాస్క్ ధరించి..నెత్తికి క్యాప్ పెట్టుకుని..చేతిలో డబ్బుతో పాటు ఓ బ్యాగ్ పట్టుకుని వచ్చాడు. క్యాషియర్ కనకదుర్గ క్యాబిన్ లోకి వెళ్లాడు. అయితే, మరో మహిళ కస్టమర్ అక్కడ ఉండడంతో సైలెంట్ గా ఓ చేర్ లో కూర్చున్నాడు. అప్పుడే క్యాషియర్ కనకదుర్గ తన దగ్గర ఉన్న కస్టమర్ తో డబ్బులు కౌంట్ చేస్తూ మాట్లాడుతూ ఉంది. Also Read: పెనుగొండలో మహిళ దారుణ హత్య..మొగుడే యముడా..! సడన్ గా దుండగుడు తన బ్యాగ్ నుండి ఒక్కసారిగా పెద్ద కత్తి తీశాడు. దీంతో ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైయ్యారు బ్యాంక్ సిబ్బంది, కస్టమర్లు. అతడిని చూసి సైలెంట్ అయిపోయారు. ఇంకా, అక్కడే పెద్ద మొత్తంలో టేబుల్ పైనా డబ్బు ఉండడంతో కత్తితో బెదిరించి తన బ్యాగ్ లో వేసుకుని పరార్ అయ్యాడు. దాదాపు రూ. 6.50 లక్షలు నగదు ఎత్తుకెళ్లాడు దుండగుడు. వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన బ్యాంకు దగ్గరకు చేరుకున్నారు. Your browser does not support the video tag. కత్తితో బెదిరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఈ మధ్య కాలంలో ఇలాంటి దొంగతనం ఘటనలు మనం చూస్తునే ఉన్నాం. పోలీసు అధికారులు నిందితులను అరెస్ట్ చేస్తున్నారు తప్ప..ఇలాంటి ఘటనలు జరగకుండా మాత్రం ఆపలేకపోతున్నారు.దీంతో బ్యాంక్ అధికారులు ఎప్పుడేం జరుగుతుందోనని భయం ..భయంగా డ్యూటి చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా పూర్తిగా అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. #narasapuram #bank-robbery మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి