/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/BANK-HOLIDAYS-jpg.webp)
అగస్టు నెల వచ్చింది. మళ్లీ అన్ని బిల్లులు కట్టుకోవాలి. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసుకోవాలి. కొంతమందికి డబ్బులు పంపాలి. పిల్లలు ఉంటే ఫీజులు కట్టాలి. ఇలా అనేక అవసరాలకు బ్యాంకులతో పని ఉంటుంది. అందుకే ముందు బ్యాంకుల్లో ఉన్న పనులు సమయానికి పూర్తిచేసుకోవాలి. ఒకవేళ చేసుకోకుండా తర్వాత చేసుకుందాం అని ఉంటే మాత్రం ఇబ్బందులు రావొచ్చు. ఎందుకంటే మీరు వెళ్లిన రోజే బ్యాంకుకు సెలవు అయితే అప్పుడు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అందుకు ప్రతి నెల మొదలైన తర్వాత ఆ నెలలో బ్యాంకులకు(BANK HOLIDAYS) ఎన్ని సెలవులు ఉన్నాయి.. ఏ రోజు సెలవు ఉందనే వివరాలు కచ్చితంగా తెలుసుకోవాలి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ప్రతి నెల సెలవుల జాబితాను ప్రకటిస్తుంది. తాజాగా ఆగస్టు నెల సెలవులను వెల్లడించింది. ఈ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు రోజుల్లో ఈ సెలవులు రానున్నాయి. ఈ సెలవులే కాకుండా ఆదివారాలతో పాటు రెండు, నాలుగో శనివారాలు బ్యాంకులకు ఎలాగో హాలీడే ఉంటుంది. ఇవి కాకుండా ఆగస్టు నెలలో కొన్ని బ్యాంకులకు ఎనిమిది సెలవులు ఉండబోతున్నాయి. ఆయా రాష్ట్రాలకు అనుకూలంగా ఈ సెలవులు ఉంటాయి.
సెలవుల వివరాలను ఓసారి పరిశీలిస్తే..
ఆగస్టు 6న ఆదివారం, ఆగస్టు 12న రెండో శనివారం, ఆగస్టు 13న ఆదివారం, ఆగస్టు 20న ఆదివారం, ఆగస్టు 26న నాలుగో శనివారం, ఆగస్టు 27న ఆదివారం
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం కాబట్టి దేశం అంతటా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 8న టెండాంగ్‌లో రమ్‌ఫాట్ కారణంగా సిక్కింలో బ్యాంకులకు సెలవు
ఆగస్ట్ 16న పార్సీ నూతన సంవత్సరం–షహన్‌షాహి కారణంగా బేలాపూర్, ముంబై, నాగ్‌పూర్‌లలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 18న శ్రీమంత్ శంకర్‌దేవ్ తిథి కారణంగా గౌహతిలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 28, 29న ఓనం పండుగ సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 30న రక్షాబంధన్ సందర్భంగా జైపూర్, సిమ్లాలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 31న రక్షా బంధన్ కారణంగా డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
మరోవైపు బ్యాంకుల పనిదినాలను వారానికి ఐదు రోజులు మాత్రమే ఉంచాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ డిమాండ్ చేస్తోంది. ఇది కనక అమలైతే ఇక వారానికి రెండు రోజులు బ్యాంకులు పనిచేయవు. ప్రస్తుతం ఉద్యోగులకు ఆదివారాలు.. రెండు, నాలుగో శనివారాల్లో సెలవులు లభిస్తున్న సంగతి తెలిసిందే.