Bank Holidays: బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్? 5 రోజుల పనిదినాలు, జీతాల పెంపు?!

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పని చేసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందని సమాచారం. బ్యాంకు ఉద్యోగుల జీతాల పెంపుతో పాటు.. బ్యాంకుల్లో 5 రోజుల పనిదినాలను అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2 గానీ, 3వ వారంలో గానీ దీనిపై ఉత్తర్వులు వెలువడనున్నాయి.

New Update
Bank Holidays: బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్? 5 రోజుల పనిదినాలు, జీతాల పెంపు?!

Bank 5 Day Holidays: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు రానున్న రోజులు తీపి కబురు చెప్పనుంది కేంద్ర ప్రభుత్వం. జీతాల పెంపునకు సంబంధించిన ప్రకటనతో పాటు.. 5 రోజుల పనిదినాలను ప్రకటించనుందని అనధికారిక సమాచారం. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులకు అన్ని ఆదివారం, శనివారాలు సెలవుదినం ప్రకటించడంతో పాటు.. జీతాల పెంపునకు సంబంధించిన అంశంపైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సెకండ్, ఫోర్త్ శనివారాల్లో సెలవు ఉండగా.. మిగతా రెండు శనివారాలు కూడా సెలవు ప్రకటించాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వహణ సంస్థ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం స్వయంగా ఈ సమాచారం ఇచ్చింది.

వారానికి 5 రోజుల పని దినాలు ప్రతిపాదన..

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5 రోజుల పని చేయాలనే డిమాండ్‌కు సంబంధించి బ్యాంకు యూనియన్లు, ఐబిఎ ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన సమర్పించిందా అని రాజ్యసభ ఎంపీ సుమిత్రా బాల్మిక్ ఆర్థిక మంత్రిని ప్రశ్నించారు. ఒకవేళ ఇలాంటి ప్రతిపాదన వస్తే.. ప్రభుత్వం అమలు చేస్తుందా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా, ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ సభకు తన లిఖితపూర్వక సమాధానంలో, అవును అని తెలిపారు. అన్ని శనివారాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించిందన్నారు. అయితే, దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఆర్థిక శాఖ సహాయ మంత్రి తన సమాధానంలో చెప్పలేదు. 28 ఆగస్టు 2015న IBA,  బ్యాంక్ యూనియన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారం బ్యాంకులకు సెలవు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి చెప్పారు.

జీతం పెంపుతో పాటు శనివారం సెలవు బహుమతి..

అయితే, ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల జీతాలను 15 నుంచి 20 శాతం పెంపుతో పాటు బ్యాంకుల్లో 5 రోజులు పని చేయాలనే నిర్ణయానికి డిసెంబర్ 2023 రెండు లేదా మూడో వారంలో ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ  తర్వాత నెల నుంచే అన్ని శనివారాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. వేతనాల పెంపునకు సంబంధించి బ్యాంక్ యూనియన్లు, IBA మధ్య కొనసాగుతున్న చర్చలు చివరి దశలో ఉన్నాయి. జీతం పెంపుతో పాటు బ్యాంకుల్లో 5 రోజుల పని దినాలు, శనివారం సెలవులు ఒకేసారి ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

8.50 లక్షల మంది ఉద్యోగులు ఎదురుచూపులు..

ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల ప్రస్తుత వేతన ఒప్పందం నవంబర్ 1, 2022తో ముగిసింది. ఈ కారణంగా, జీతాల పెంపుపై ఏకాభిప్రాయం సాధించడానికి యూనియన్లు, IBA మధ్య చర్చలు జరుగుతున్నాయి. దేశంలోని 8.50 లక్షల మందికి పైగా బ్యాంకు ఉద్యోగులు జీతాల పెంపు శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే, లోక్‌సభ ఎన్నికలలోపు జీతాల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం కూడా భావిస్తోందని సమాచారం.

Also Read:

వీరు నెయ్యిని అస్సలు తినకూడదు.. లేదంటే సమస్యలు తప్పవు..!

సీఎం ఫైనల్‌ రేసులో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌.. హైకమాండ్ ఎవరి వైపు?

Advertisment
తాజా కథనాలు