ఘనంగా అయ్యప్ప గజారోహణం! స్వామి వారి మండల పూజల్లో భాగంగా శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వరస్వామి ఆలయంలోని అయ్యప్ప మందిరంలో గజారోహణం కనుల విందుగా జరిగింది.శబరిమల మేల్ శాంతి మనోజ్ నంబూద్రి ఆధ్వర్యంలో సాయంత్రం ఏనుగు అంబారీ పై అయ్యప్ప స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు By Bhavana 18 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి హైదరాబాద్ నగరం బంజారాహిల్స్‌లోని అయ్యప్ప మందిరం స్వాములతో కళకళలాడుతోంది. ఎటు చూసినా మాలధారులు ఉన్నారు. నిత్యం వారి నోటి వెంట వచ్చే స్వామియే శరణమయ్యప్ప అంటూ మారుమోగాయి. స్వామి వారి మండల పూజల్లో భాగంగా శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వరస్వామి ఆలయంలోని అయ్యప్ప మందిరంలో గజారోహణం కనుల విందుగా జరిగింది. స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ, గణపతి హోమాన్ని వేద పండితులు నిర్వహించారు. శబరిమల తరహాలో స్వామి వారి నగలను ఊరేగింపు నిర్వహించారు. శబరిమలలో వచ్చినట్లే ఇక్కడ కూడా స్వామి వారి నగలకు గరుడ పక్షి కాపలాగా రావడంతో భక్తులు పరవశించిపోయారు. శబరిమల మేల్ శాంతి మనోజ్ నంబూద్రి ఆధ్వర్యంలో స్వామివారి పడిపూజ, భగవతి సేవ నిర్వహించారు. పూజల అనంతరం సాయంత్రం ఏనుగు అంబారీ పై అయ్యప్ప స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఆలయ ఈవో లావణ్య ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రామయ్య ఊరేగింపును ప్రారంభించారు. శ్రీనగర్ కాలనీ, ఇందిరా నగర్, కృష్ణా నగర్, యూసఫ్ గూడ, శాలివాహన నగర్..మీదుగా స్వామి వారి ఊరేగింపు ఆలయానికి చేరుకుంది. కేరళ తరహా మేళ తాళాలు,దేవతా మూర్తుల వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ అర్చకులు శ్రీనివాసశర్మ, గురు స్వామి రామకృష్ణ శర్మ గురుస్వామి పూజాధికాలను పర్యవేక్షించారు. Also read: ఆ ఎమ్మెల్యే టీడీపీకి అమ్ముడుపోయాడు.. వైసీపీ నేత ఆరోపణలు #hyderabad #srinagar-colony #ayyapa-swami-pooja మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి