Napier: కివీస్ కు షాకిచ్చిన బంగ్లా.. నేపియర్ లో చారిత్రక విజయం

మూడు వన్డేల సిరీస్ లో చివరి మ్యాచ్ లో బంగ్లా జట్టు కివీస్ టీంకు షాకిచ్చింది. నేపియర్‌ వేదికగా శనివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో 98 పరుగులకే ఆలౌట్ చేసి సంచలనం సృష్టించింది. 9 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచి రికార్డు నమోదు చేసింది. న్యూజిలాండ్ గడ్డపై బంగ్లాకు ఇదే తొలి విజయం.

Napier: కివీస్ కు షాకిచ్చిన బంగ్లా.. నేపియర్ లో చారిత్రక విజయం
New Update

Napier ODI: మూడు వన్డేల సిరీస్ లో చివరి మ్యాచ్ లో బంగ్లా జట్టు కివీస్ టీంకు షాకిచ్చింది. నేపియర్‌ వేదికగా శనివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో 98 పరుగులకే ఆలౌట్ చేసి సంచలనం సృష్టించింది. 9 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచి రికార్డు నమోదు చేసింది. హేమాహేమీ ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న ఆ జట్టును అనూహ్యంగా దెబ్బతీయడం ద్వారా సిరీస్ కోల్పోయిన నిరాశను అధిగమించినట్లైంది.

సిరీస్‌ ఓడినా...
బంగ్లా, కివీస్ జట్ల మధ్య డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్‌ స్టార్టైంది. ఫస్ట్ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయీస్‌ ప్రకారం 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది. రెండో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో బంగ్లా జట్టును ఓడించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. సిరీస్ చివరి మ్యాచ్‎లోనూ గెలిచి వైట్ వాష్ చేయాలనుకున్న కివీస్ ఆశలపై బంగ్లా జట్టు నీళ్లు చల్లింది.

ఇది కూడా చదవండి: ‘అదంతా గ్రౌండ్‌లోనే..’ కోహ్లీతో ఫైట్‌ గురించి గంభీర్‌ లవ్‌లీ రిప్లై!

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ బంగ్లా బౌలర్ల ధాటికి కుదేలైంది. మొదటి నుంచే దూకుడు ప్రదర్శించిన బంగ్లా బౌలర్లు చివరి వరకూ అదే జోరు కొనసాగించారు. ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. పేసర్లు షోరిఫుల్‌ ఇస్లాం మూడు, తాంజిం హసన్‌ సకీబ్‌ మూడు, సౌమ్య సర్కార్‌ మూడు వికెట్లతో చెలరేగిపోగా, ముస్తాఫిజుర్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. ఓపెనర్‌ విల్‌ యంగ్‌ చేసిన 26 పరుగులే న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోర్. కెప్టెన్‌ టామ్‌ లాథం 21 పరుగులు చేయగా, మిగతా వారంతా ఇలా వచ్చి అలా వెళ్లడంతో 31.4 ఓవర్లలో 98 పరుగులకే న్యూజిలాండ్‌ చాపచుట్టేసింది.


ఛేజింగ్ లో ఒక వికెట్ కోల్పోయి బంగ్లా విజయానికి అవసరమైన స్కోర్ చేసింది. ఓపెనర్‌ అనముల్‌ హక్‌ 37 పరుగులతో రాణించగా, మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్‌ నజ్ముల్‌ షాంటో హాఫ్ సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు. బంగ్లా జట్టుకు న్యూజిలాండ్‌ గడ్డ మీద ఇదే తొలి వన్డే విజయం కావడం విశేషం.

#bng-vs-nz #napier-odi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe