Muhammad Yunus: బంగ్లాదేశ్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రజల తిరుగుబాటుతో దేశం వదిలి ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా పారిపోయారు. అల్లరిమూకల హింసను అడ్డుకోవడానికి అక్కడి మిలటరీకి సాధ్యం కావడంలేదు. అయితే, తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితిలో పార్లమెంట్ ను రద్దుచేసి బంగ్లా అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ తదుపరి చర్యలకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో రక్షణ దళానికి చెందిన మూడు విభాగాల అధిపతులు, 13 మంది విద్యార్థి ఉద్యమ సభ్యులతో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. విద్యార్ధి ఉద్యమ సభ్యులు తమకు నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరడంతో.. ఆయనను తాత్కాలిక ప్రధానిగా నియమించారు.
పూర్తిగా చదవండి..Muhammad Yunus: ఎవరీ మొహమ్మద్ యూనస్? ఆయనకూ.. హసీనాకు మధ్య ఏమిటి గొడవ ?
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రిగా దేశానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బంగ్లాదేశ్లో ఇప్పుడు రిజర్వేషన్ వివాదంతో హింసాకాండ చెలరేగింది. దీంతో ప్రధానిషేక్ హసీనా పదవికి రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయారు.
Translate this News: