Muhammad Yunus: ఎవరీ మొహమ్మద్ యూనస్? ఆయనకూ.. హసీనాకు మధ్య ఏమిటి గొడవ ?

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రిగా దేశానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బంగ్లాదేశ్‌లో ఇప్పుడు రిజర్వేషన్ వివాదంతో హింసాకాండ చెలరేగింది. దీంతో ప్రధానిషేక్ హసీనా పదవికి రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయారు.

New Update
Muhammad Yunus: ఎవరీ మొహమ్మద్ యూనస్? ఆయనకూ.. హసీనాకు మధ్య ఏమిటి గొడవ ?

Muhammad Yunus: బంగ్లాదేశ్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రజల తిరుగుబాటుతో దేశం వదిలి ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా పారిపోయారు. అల్లరిమూకల హింసను అడ్డుకోవడానికి అక్కడి మిలటరీకి సాధ్యం కావడంలేదు. అయితే, తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితిలో పార్లమెంట్ ను రద్దుచేసి బంగ్లా అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ తదుపరి చర్యలకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో  రక్షణ దళానికి చెందిన మూడు విభాగాల అధిపతులు, 13 మంది విద్యార్థి ఉద్యమ సభ్యులతో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. విద్యార్ధి ఉద్యమ సభ్యులు తమకు నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరడంతో.. ఆయనను తాత్కాలిక ప్రధానిగా నియమించారు. 

Muhammad Yunus: ఒకప్పుడు షేక్ హసీనా మొహమ్మద్ యూనస్ ను రక్తపిపాసి అని వర్ణించారు. ఆయనే ఇప్పుడు దేశానికి తాత్కాలిక ప్రధాని అయ్యారు. నిజానికి హసీనా-యూనస్ మధ్య ఉన్న శత్రుత్వమే దేశంలో ఇంతటి వివాదానికి కారణం అని అక్కడ కొందరు చెప్పుకోవడం జరుగుతొంది. ఎవరు ఈ మొహమ్మద్ యూనస్. ఆయననే ఎందుకు విద్యార్ధి సంఘాలు ప్రధానిగా కోరుకున్నాయి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

గ్రామీణ బ్యాంకుతో ప్రపంచాన్ని ఆకర్షించి.. 

Muhammad Yunus: ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ 1983లో బంగ్లాదేశ్‌లో గ్రామీణ బ్యాంకును స్థాపించారు.  క్రెడిట్ అనేది ప్రాథమిక మానవ హక్కు అనే నమ్మకంతో దీనిని ముందుకు తీసుకు వెళ్లారు. పేద ప్రజలకు తగిన నిబంధనలపై రుణాలు అందించడం ద్వారా - వారికి కొన్ని మంచి ఆర్థిక సూత్రాలను బోధించడం ద్వారా పేదరికం నుండి బయటపడటానికి సహాయం చేయడం ఆయన లక్ష్యం. 

70వ దశకం మధ్యకాలంలో బంగ్లాదేశ్‌లోని నిరాశ్రయులైన బాస్కెట్‌వీవర్‌లకు డాక్టర్ యూనస్ వ్యక్తిగతంగా చిన్న మొత్తాల డబ్బు రుణం ఇవ్వడం నుండి, గ్రామీణ బ్యాంకు మైక్రోలెండింగ్ ద్వారా పేదరికాన్ని నిర్మూలించే దిశగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఉద్యమంలో అగ్రగామిగా మారింది. గ్రామీణ బ్యాంక్ మోడల్ ను ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు అనుసరించాయి. ఇదీ ఆయన లక్ష్యం గొప్పతనాన్ని వెల్లడిస్తుంది. 

అత్యధిక రికవరీ.. 

Muhammad Yunus: 2006లో గ్రామీణ బ్యాంక్‌కి శాంతి బహుమతి లభించినప్పుడు, ఏడు మిలియన్లకు పైగా రుణగ్రహీతలకు అలాంటి రుణాలు మంజూరు ఇచ్చారు. రుణం తీసుకున్న సగటు మొత్తం 100 డాలర్లు. తిరిగి చెల్లించే శాతం చాలా ఎక్కువగా ఉంది. 95 శాతానికి పైగా రుణాలు మహిళలకు లేదా మహిళల సమూహాలకు వచ్చాయి. ఇది బ్యాంకుకు అత్యుత్తమ భద్రతను - రుణగ్రహీతల కుటుంబాలకు గొప్ప ప్రయోజనకరమైన ప్రభావాన్ని అందించింది.

చిట్టగాంగ్ నుంచి.. 

Muhammad Yunus: 1940లో ఓడరేవు నగరం చిట్టగాంగ్‌లో జన్మించిన ప్రొఫెసర్ యూనస్ బంగ్లాదేశ్‌లోని ఢాకా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు.  ఆపై వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించడానికి ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్ పొందారు. ఆయన  తన Ph.D. 1969లో వాండర్‌బిల్ట్ నుండి ఆర్థిక శాస్త్రంలో పూర్తి చేశారు. ఆ  మరుసటి సంవత్సరం మిడిల్ టేనస్సీ స్టేట్ యూనివర్శిటీలో ఆర్థిక శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మారారు. బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన యూనస్ చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర విభాగానికి నాయకత్వం వహించారు. 

1993 నుండి 1995 వరకు, ప్రొఫెసర్ యూనస్ మహిళలపై నాల్గవ ప్రపంచ కాన్ఫరెన్స్ కోసం ఇంటర్నేషనల్ అడ్వైజరీ గ్రూప్‌లో సభ్యుడిగా ఉన్నారు.  ఈ పదవికి ఆయనను  UN సెక్రటరీ జనరల్ ఎంపిక చేశారు. గ్లోబల్ కమీషన్ ఆఫ్ ఉమెన్స్ హెల్త్, అడ్వైజరీ కౌన్సిల్ ఫర్ సస్టెయినబుల్ ఎకనామిక్ డెవలప్‌మెంట్, యుఎన్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ ఉమెన్ అండ్ ఫైనాన్స్‌లో పనిచేశారు.

ప్రొఫెసర్ యూనస్ తన ఆలోచనలు - ప్రయత్నాల కోసం అనేక అంతర్జాతీయ అవార్డులను అందుకున్నాడు, ఇందులో సైన్స్ కోసం మహమ్మద్ షాబ్దీన్ అవార్డు (1993), శ్రీలంక; హ్యుమానిటేరియన్ అవార్డు (1993), CARE, USA; వరల్డ్ ఫుడ్ ప్రైజ్ (1994), వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్, USA; ఇండిపెండెన్స్ డే అవార్డు (1987), బంగ్లాదేశ్ అత్యున్నత పురస్కారం; కింగ్ హుస్సేన్ హ్యుమానిటేరియన్ లీడర్‌షిప్ అవార్డు (2000), కింగ్ హుస్సేన్ ఫౌండేషన్, జోర్డాన్; వోల్వో ఎన్విరాన్‌మెంట్ ప్రైజ్ (2003), వోల్వో ఎన్విరాన్‌మెంట్ ప్రైజ్ ఫౌండేషన్, స్వీడన్; నిక్కీ ఆసియా ప్రైజ్ ఫర్ రీజినల్ గ్రోత్ (2004), నిహాన్ కీజై షింబున్, జపాన్; ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ ఫ్రీడమ్ అవార్డు (2006), రూజ్‌వెల్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది నెదర్లాండ్స్; మరియు సియోల్ శాంతి బహుమతి (2006), సియోల్ శాంతి ప్రైజ్ కల్చరల్ ఫౌండేషన్, సియోల్, కొరియా. బహుమతులు ఉంన్నాయి. ఆయన  ఐక్యరాజ్యసమితి ఫౌండేషన్ బోర్డు సభ్యుడుగా ఉన్నారు. 

హసీనాతో గొడవ ఏమిటి?

 2007లో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు యూనస్ ప్రకటించారు.  దీంతో హసీనా కు ఆయనకు మధ్య విబేధాలు వచ్చాయని చెబుతారు. పేదల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు బలప్రయోగం చేస్తున్నారని ఆరోపిస్తూ  2008లో యూనస్‌పై విచారణకు హసీనా ఆదేశించారు. అప్పటి నుంచి ఆయన  హసీనా శత్రువు అనే వాదన కూడా బంగ్లాదేశ్ లో వినిపిస్తోంది. 

మొత్తంమీద బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితికి కారణాలు.. కర్ణుడి చావు కి ఉన్నన్ని కారణాలుగా కనిపిస్తున్నాయి. అన్నిటిలోనూ ప్రధానమైనది షేక్ హసీనా నియంతృత్వ పోకడలే కారణమనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న మొహమ్మద్ యూనస్ ఇప్పుడు ఏమి చేస్తారనేదానిపై బంగ్లాదేశ్ పరిస్థితులు.. దేశ భవిష్యత్ ఆధారపడి ఉన్నాయనేది వాస్తవం. 

#muhammad-yunus
Advertisment
తాజా కథనాలు