Bangladesh: ఆ విషయంలో భారత్ ను మించిపోయిన బంగ్లాదేశ్ వియత్నాం, బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాలు ఎగుమతి రంగంలో భారత్‌ను అధిగమిస్తున్నాయి. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ఒక నివేదిక ఇచ్చింది. వస్త్ర, తోలు, దుస్తుల ఉత్పత్తుల ఎగుమతిలో ఈ దేశాలు భారత్ ను మించిపోయాయి. పదేళ్లుగా మన దేశం నుంచి ఈ ప్రోడక్ట్స్ ఎగుమతులు బాగా తగ్గాయి. By KVD Varma 05 Sep 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Bangladesh: వియత్నాం - బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాలు వస్త్ర, తోలు, దుస్తులు ఉత్పత్తుల ఎగుమతిలో భారతదేశాన్ని అధిగమించాయి. చైనా ప్లస్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవడంలో భారత్ విఫలమైందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది. పై ఉత్పత్తుల ఎగుమతుల్లో భారతదేశం ప్రపంచ వాటా పదేళ్లుగా క్షీణిస్తూ వస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ప్రపంచ వాణిజ్య వాటా మాత్రం పెరగడం లేదు. తయారీ ఉత్పత్తుల ఎగుమతిలో బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలు భారత్‌ను వెనక్కి నెట్టివేస్తున్నాయని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, గత దశాబ్దంలో GDP లో వస్తువులు, సేవల పరిమాణ శాతం క్షీణిస్తోంది. Bangladesh: 2002లో తోలు, వస్త్రాలు, దుస్తులు, పాదరక్షల ఎగుమతుల్లో భారతదేశం ప్రపంచ వాటా 0.9 ఉంది. 2013లో ఇది శాతంగా ఉంది. 4.5కి పెరిగింది. ఆ తరువాత నుంచి ఇది తగ్గుతూ వస్తోంది. 2022లో ఈ మొత్తం 3.50శాతానికి తగ్గింది. అదే సమయంలో, ఈ ఉత్పత్తుల ఎగుమతిలో బంగ్లాదేశ్ వాటా 5.1 శాతం. కాగా వియత్నాం వాటా 5.9 శాతంగా ఉంది. ఎగుమతి పోటీలో చిన్న దేశాలు భారత్‌ను వెనక్కి నెట్టివేస్తున్నట్లు ప్రపంచబ్యాంకు విడుదల చేసిన గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. ఈ ఎగుమతి భారతదేశానికి ఎందుకు ముఖ్యమైనది? Bangladesh: పైన పేర్కొన్న వస్త్రాలు .. వస్త్ర పరిశ్రమలు చాలా ఉపాధిని సృష్టించగలవు. ఇది శ్రమతో కూడిన ఇండస్ట్రీ. అందువల్ల ఇది మరింత బలపడితే సామాన్య కార్మికులకు(అన్ స్కిల్డ్ కార్మికులకు) మరింత ఉపాధిని సృష్టించవచ్చు. ప్రస్తుతం భారతదేశ ఎగుమతుల్లో ఎక్కువ భాగం మూలధన ఆధారితమైనదిగా ఉంది. ఇక్కడ ఉపాధి కల్పన తక్కువగా ఉంటుంది. భారతదేశంలోని తయారీ రంగం గత దశాబ్దంలో వివిధ PLI పథకాల ద్వారా అభివృద్ధి చెందుతోంది. అయితే శ్రమశక్తి రంగం నిర్లక్ష్యం చేసినట్లు కనిపిస్తోంది. టెక్స్‌టైల్స్ వంటి లేబర్ ఇంటెన్సివ్ మాన్యుఫాక్చరింగ్ రంగం పురోగమించాలంటే ప్రభుత్వం వ్యాపార వ్యయాన్ని తగ్గించాలి. పన్ను, పన్నేతర వ్యత్యాసాన్ని తగ్గించాలి. వాణిజ్య ఒప్పందాలను సవరించాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. Bangladesh: మొత్తం ఎగుమతుల విషయంలో భారత్ ముందుంది. ఒక సంవత్సరంలో సుమారు 800 బిలియన్ డాలర్లు ఎగుమతి ద్వారా వస్తోంది. దీనితో పోలిస్తే బంగ్లాదేశ్ ఎగుమతులు దాదాపు 60 బిలియన్ డాలర్లు. అయితే, వస్త్రాలు, దుస్తులు .. తోలు ఉత్పత్తుల ఎగుమతిలో బంగ్లాదేశ్ .. వియత్నాం భారతదేశాన్ని అధిగమించాయి. సాంప్రదాయకంగా, ఈ రంగంలో చైనా ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది. #bangladesh #exports మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి