Bangalore: బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్ అయ్యాడు. ఈ నెల 23న పీజీ హాస్టల్‌లో ఉంటున్న కృతి అనే యువతిని గొంతుకోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. నిందితుడు అభిషేక్‌ను మధ్యప్రదేశ్‌లో పట్టుకున్న పోలీసులు విచారణ కోసం అతడిని కర్ణాటకకు తరలించారు. సీసీ ఫుటేజ్‌లో రికార్డైన యువతిని హత్య చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీంతో ఈ కేసుపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. నిందితుడి కోసం మూడు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు భోపాల్‌లో దొరికాడు.
బీహార్‌కు చెందిన కృతికుమార్ అనే యువతిని భోపాల్‌కు చెందిన అభిషేక్ గొంతు కోసం హత్య చేశాడు. అభిషేక్ ప్రియురాలికి మృతురాలు కృతికుమారి ఫ్రెండ్. అభిషేక్ ఉద్యోగం చేయడం లేదనే విషయంలో గొడవల కారణంగా ప్రియురాలు అతడిని దూరం పెట్టింది. అయితే, తన ప్రియురాలు దూరమవడానికి కృతికుమారే కారణమని రగిలిపోయిన అభిషేక్.. అర్థరాత్రి హాస్టల్లోకి వెళ్లి కృతికుమారిని దారుణంగా కత్తితో హత్య చేసి పరార్ అయ్యాడు. ఎట్టకేలకు నేడు పోలీసులకు చిక్కాడు.
Also Read : సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా ? ఫ్రీ కోచింగ్, ఫ్రీ హాస్టల్.. ఎక్కడంటే