Bandla Krishna Mohan Reddy: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాట్ టాపిక్‌గా మారారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కొద్ది రోజుల్లోనే తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్లారు. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఇష్యూపై సీఎం రేవంత్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కృష్ణ మోహన్‌రెడ్డి యూటర్న్‌కు కారణమేంటి? తెలుసుకోవాలని మంత్రి జూపల్లితో రాయబారం పంపారు. కృష్ణమోహన్‌రెడ్డి ఇంటికి జూపల్లి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వెళ్లారు.
కృష్ణ మోహన్ రెడ్డి పార్టీ మార్పు కారణాలపై చర్చ నెలకొంది. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి జంప్ అవడంతో సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. రాత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన 9 మంది ఎమ్మెల్యేలతో డిన్నర్ చేశారు. 9 మంది ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారనే సంకేతాలు పంపారు. వెళ్లిపోయిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని కూడా మళ్లీ లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి బండ్ల ఎలాటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన