ఏపీ బీజేపీ ఇంచార్జ్‌గా బండి సంజయ్ అంటూ జోరుగా ప్రచారం!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ కేంద్ర నాయకత్వం కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఏపీ, తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షులను మార్చిన అధిష్టానం పెద్దలు తాజాగా జాతీయ కార్యవర్గంలో బండి సంజయ్, సత్యకుమార్‌లకు చోటు కల్పించారు. అయితే బండిని ఏపీ ఇంచార్జ్‌గా నియమంచి మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Bandi Sanjay : బీఆర్‌ఎస్ అంటే బ్రష్టాచార్‌ రాష్ట్ర సమితి: బండి సంజయ్
New Update

తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్..

ఎన్నికల వేళ బీజేపీ కేంద్ర నాయకత్వం తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల అధ్యక్షులను మార్చిన అధిష్టానం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఏపీ శాఖ అధ్యక్షురాలిగా పురందేశ్వరికి బాధ్యతలు అప్పగించిన హైకమాండ్ సత్యకుమార్‌ను పార్టీ కార్యదర్శిగా కొనసాగిస్తుంది. ఇదే క్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా జాతీయ కార్యవర్గంలో చోటు దక్కించుకున్న బండి సంజయ్‌కు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్‌గా నియమించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో ఏపీ ఇన్ఛార్జీగా ఉన్న సునీల్ దేవధర్‌ పేరును తొలగించింది. ఇప్పుడు ఈయన స్థానంలో బండికి బాధ్యతలు కేటాయించనుందని సమాచారం.

సునీల్ స్థానంలోకి బండి..?

అయిదేళ్లుగా ఏపీ బీజేపీ ఇంఛార్జ్‌గా పని చేసిన సునీల్ దేవధర్.. 2018లో బాధ్యతలు స్వీకరించారు. అయితే 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో పాటు నేతల్లో సమన్వయలోపం కొరవడింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో రాష్ట్ర నేతలు సఖ్యతగా ఉండకపోవడంతో ఏపీలో బీజేపీ దిక్కులేని పార్టీగా మిగిలిపోయింది. మరోవైపు ఆయన పనితీరుపై పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనను తొలగించిన కమలం పెద్దలు బండి సంజయ్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో ఫుల్ జోష్ తెచ్చిన బండి సంజయ్ అయితే ఆంధ్రాలో కూడా పార్టీకి మంచి ఊపు వస్తుందని అనుకుంటున్నారట.

బండి అయితే బలం పెరుగుతందనే యోచన.. 

ఏపీ ఇంచార్జ్‌గా బండి సంజయ్‌ను నియమిస్తే జగన్ ప్రభుత్వంపై పోరాడేందుకు బీజేపీ బలం పెరుగుతుందనే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఎంతో రాజకీయం అనుభం ఉన్న రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వంటి నాయకురాలికి ఫైర్ బ్రాండ్ అయిన బండి నాయకత్వం తోడు అయితే వైసీపీని ధీటుగా ఎదుర్కొవొచ్చని భావిస్తున్నారట. అలాగే జనసేనతో కూడా కలిసి పోరాటం చేస్తే పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని అనుకున్నారట. అందుకే జాతీయ నేతగా బండి సేవలు వినియోగించుకొనే విధంగా నిర్ణయం ఉంటుందని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తేలాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe