గవర్నర్ భుజంపై కేసీఆర్ తుపాకీ పెట్టి కాల్చుతున్నారు: బండి

ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ భుజంపై తుపాకీ పెట్టి సీఎం కేసీఆర్ కాల్చుతున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. అంత పెద్ద బిల్లుపై రాత్రికి రాత్రే ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు.

గవర్నర్ భుజంపై కేసీఆర్ తుపాకీ పెట్టి కాల్చుతున్నారు: బండి
New Update

పంటనష్టంపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. 

భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో జరిగిన పంట నష్టంపై వెంటనే సీఎం కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రుణమాఫీ చేస్తామని.. పంటనష్టం రూ.10వేలు ఇస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పాత పథకాలు బంద్ చేసి.. కొత్త పథకాలు ప్రారంభిస్తున్నారని విమర్శలు చేశారు. ఎన్నికలకు మూడు నెలల ముందే మద్యం టెండర్లు వేస్తున్నారని విమర్శలు చేశారు. వర్షాల కారణంగా ఎంత నష్టం జరిగిందో ప్రభుత్వం దగ్గర ఇప్పటివరకు వివరాలు లేవన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో వరదలకు దెబ్బతిన్న కల్వల ప్రాజెక్టును ఆయన సందర్శించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారి కరీంనగర్ వచ్చిన బండికి స్థానిక బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

రాత్రికి రాత్రే ఎలా నిర్ణయం తీసుకుంటారు..

ఇక ఆర్టీసీ విలీనం గురించి మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంనపై కేసీఆర్ నాలుగేళ్లు ఆలోచించారన్నారు. గవర్నర్ మాత్రం ఆలోచించకూడదా? ప్రశ్నించారు. ఆగమేఘాల మీద గవర్నర్ స్టాంప్ వేసి బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపాలా? అని నిలదీశారు. బిల్లుతో ఏదైనా నష్టం వస్తే గవర్నర్ సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. గవర్నర్ భుజంపై తుపాకీ పెట్టి కేసీఆర్ కాల్చుతున్నారని మండిపడ్డారు. అంత పెద్ద బిల్లుపై రాత్రికి రాత్రే ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. కార్మికులకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో బిల్లును గవర్నర్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని సంజయ్ తెలిపారు. అసలు ఆర్టీసీ నష్టాల్లో ఉండటానికి కేసీఆరే కారణమని ఆరోపించారు.

అంతకుముందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన బండి సంజయ్‌కి తెలంగాణ బీజేపీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నాంపల్లి బీజేపీ కార్యాలయం వరకు అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోల్కొండ ఖిల్లా మీద కాషాయ జెండా ఎగరడమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కిషన్ రెడ్డి అధ్వర్యంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు గతంలో రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడేమో జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పార్టీలో నేతల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని బండి స్పష్టంచేశారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe