Bandi Sanjay: చెంగిచర్ల పాకిస్తాన్ లో ఉందా? రాజాసింగ్ హౌజ్ అరెస్ట్ పై బండి ఫైర్!

చెంగిచర్ల బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న రాజాసింగ్ ను హౌజ్ అరెస్ట్ చేయడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో బీజేపీ కార్యకర్తలను భయపెట్టలేరని, కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలనను చూపిస్తుందన్నారు.

New Update
Bandi Sanjay: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay On Raja Singh Housing Arrest:  చెంగిచర్ల బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న రాజాసింగ్ ను హౌజ్ అరెస్ట్ చేయడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంగిచర్ల పాకిస్తాన్ లో ఉందా? ఇదేం దుర్మార్గం అంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కేసీఆర్ రజాకార్ల పాలనను చూపిస్తే.. కాంగ్రెస్ నేతలు ఎమర్జెన్సీనాటి ఇందిరమ్మ పాలనను చూపిస్తున్నారంటూ తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు.

దమ్ముంటే ఆ పని చేయండి..
ఈ మేరకు బండి మాట్లాడుతూ.. రోహింగ్యాల దాడిలో గాయపడ్డ పేదలను సిట్టింగ్ ఎమ్మెల్యే పరామర్శించడానికి వెళ్లాలనుకోవడమే నేరమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ రజాకార్ల పాలనను చూపిస్తే.. కాంగ్రెస్ (Congress) నేతలు ఎమర్జెన్సీనాటి ఇందిరమ్మ పాలనను చూపిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వానికి దమ్ముంటే చెంగిచర్లలో (Chengicherla) రోహింగ్యాలు చేస్తున్న మాఫియా దందాను అరికట్టాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Aravind: RTV తో ఎంపీ అరవింద్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ.. రేవంత్ పొట్టోడు, కవిత క్రిమినల్ అంటూ..!

సహనాన్ని చేతకానితనంగా భావించొద్దు..
అలాగే దేశ ద్రోహులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినా పట్టించుకోవట్లేదని, బాధితులు, అమాయకుల మీద కేసుల పెట్టి రోహింగ్యాల దాడిని తప్పుదారి పట్టించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజల మీద దాడులు చేయకుండా చెక్ పోస్టులు, బ్యారికేడ్లు పెట్టడం చూశాం. కానీ పేదలకు భరోసా కల్పించేందుకు వెళుతున్న వారిని అడ్డుకునేందుకు బ్యారికేడ్లు పెట్టడమేంది? హౌజ్ అరెస్ట్ ద్వారా రాజాసింగ్ ను ఆపలేరు. చెంగిచర్ల వెళ్లిన బీజేపీ (BJP) కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తారా? అక్రమ కేసులకు బీజేపీ కార్యకర్తలను భయపెట్టలేరు. కేసులకు భయపడే ప్రసక్తే లేదు. బాధితుల పక్షాణ మాట్లాడుతున్న రాజాసింగ్ హౌజ్ అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. ఇక తమ సహనాన్ని చేతకానితనంగా భావించొద్దని హెచ్చరించారు. తక్షణమే బీజేపీ కార్యకర్తలతోపాటు పేదలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు