అమిత్ షాతో బండి భేటీ!

టీబీజేపీ(TBJP) పదవి నుంచి తొలగించబడ్డ తరువాత మొదటి సారి బండి సంజయ్(Bandi sanjay) ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా(Amit shah) తో ఈ రోజు ఉదయం పార్లమెంట్ లోని హోంమంత్రి కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత అమిత్ షాను బండి సంజయ్ కలవడం ఇదే మొదటిసారి. దీంతో ఈ భేటీ పై ప్రాధాన్యత సంతరించుకుంది.

New Update
అమిత్ షాతో బండి భేటీ!

amitshah met bandi sanjay ఢిల్లీలో అమిత్‌ షాను కలిసిన బండి సంజయ్‌

టీబీజేపీ(TBJP) పదవి నుంచి తొలగించబడ్డ తరువాత మొదటి సారి బండి సంజయ్(Bandi sanjay) ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా(Amit shah) తో ఈ రోజు ఉదయం పార్లమెంట్ లోని హోంమంత్రి కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత అమిత్ షాను బండి సంజయ్ కలవడం ఇదే మొదటిసారి. దీంతో ఈ భేటీ పై ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలపై వీరిద్దరు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై బండి సంజయ్ తో సమావేశమై చర్చించినట్లు అమిత్ షానే స్వయంగా ట్వీట్ చేశారు. అయితే పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ తప్పుకున్న తర్వాత రాష్ట్రంలోని బీజేపీలో జోష్ తగ్గినట్లు తెలుస్తోంది.

దాంతోపాటు బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు కూడా బీజేపీ పై ప్రభావం చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరో వైపు బండి సంజయ్ కు అధిష్టానం ఏ విధంగా న్యాయం చేస్తుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన అభిమాన వర్గం ఆ విషయంలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి బండి సంజయ్ పరిస్థితి నెక్ట్స్ ఏంటనే సమయంలో అమిత్ షాతో ఆయన భేటీ కావడం కీలకంగా మారింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు