BREAKING: ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ..బండారు అరెస్ట్.. నెక్ట్స్ ఏం జరగబోతోంది?

ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. అనకాపల్లి జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు స్టేషన్‌కు పోలీసులుతో వెళ్లేందుకు బండారు సత్యనారాయణ అంగీకరించారు. కాసేపట్లో గుంటూరు బయలదేరనున్నారు బండారు. రేపు(అక్టోబర్ 3) ఉదయం ఆయన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు పోలీసులు.

New Update

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బండారు సత్యనారాయణమూర్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. బండారు సత్యనారాయణమూర్తిపై రెండు కేసులు నమోదు చేశారు.ఏపీ మంత్రి రోజాపై, ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఈ రెండు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విషయమై నోటీసులు ఇచ్చేందుకు ఇవాళ ఉదయం నుంచి బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద పోలీసులు ప్రయత్నించారు. అయితే టీడీపీ కార్యకర్తలు పోలీసులను బండారు సత్యనారాయణమూర్తి ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. బండారు ఇంట్లోకి వెళ్లిన పోలీసులు... ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. బండారుకు బీపీ, షుగర్‌ ఎక్కువగా ఉండడంతో... పోలీసులు బండారు ఇంట్లోనే వేచిచూసి, చివరకు అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మరోవైపు టీడీపీ మద్దతుదారులు ఉదయం నుంచి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మాజీ మంత్రి ఇంటి ముందు బైఠాయించారు.

బండారు సత్యనారాయణ ఏం అన్నారు?
మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన దగ్గరున్న వీడియోలు బయటపెడితే రోజా, ఆమె భర్త ఆత్మహత్య చేసుకుంటారని, ఆమె కుటుంబం చిన్నాభిన్నమవుతుందన్నారు. ఈ అనుచిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. బండారు సత్యనారాయణను అరెస్టు చేయాలంటూ డీజీపీకి లేఖ రాశారు ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ. ఇక రోజాపై బండారు చేసిన అనుచిత వ్యాఖ్యలు టీడీపీ పార్టీ నేతల్లో చర్చనీయాంశమయ్యాయి. 'బ్లూఫిల్మ్స్', 'గెస్ట్ హౌస్', 'బజారు బతుకమ్మ' వంటి బండారు చేసిన అనుచిత ఆరోపణలు ఇప్పుడు టీడీపీ నేతలను ఇరకాటంలో పడేశాయి. ఓ మహిళా మంత్రితో టీడీపీ నేతలు మాట్లాడే తీరు ఇదేనా అని వైసీపీ నేతలు ప్రశ్నించారు. వైసీపీ సానుభూతిపరుడు, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారుపై విరుచుకుపడ్డారు. ఏ సందర్భంలోనైనా ఏ మగవాడైనా ఏ మహిళపైనైనా ఇంత అవమానకరంగా మాట్లాడగలడా అని వర్మ తన ట్వీట్ లో ప్రశ్నించారు.

ALSO READ: ‘ఏం ముఖం పెట్టుకొని నల్గొండకు వస్తున్నావ్..’ కేటీఆర్‌ మాయమాటలు చెప్పిండు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు