Banana Peels: తొక్క కాదు ఇది.. అందానికి కేరాఫ్.. అరటిపండు తిన్న తర్వాత తొక్కను ఇలా వాడి చూడండి!

అరటిపండు తొక్కతో ముఖాన్ని కూడా అందంగా మార్చుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అరటి తొక్క లోపలి భాగాన్ని ముఖం, మెడపై రుద్దితే.. ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. మురికిని తొలగిస్తుంది. అరటితొక్కతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకోవాలంటే ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Banana Peels: తొక్క కాదు ఇది.. అందానికి కేరాఫ్.. అరటిపండు తిన్న తర్వాత తొక్కను ఇలా వాడి చూడండి!

Banana Peels: అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే అరటిపండు తొక్కతో ముఖాన్ని కూడా అందంగా మార్చుకోవచ్చని చాలామందికి తెలియదు. అరటిపండు ఆరోగ్యానికి, చర్మానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. దీని తొక్కను ఉపయోగించడం ద్వారా ముఖానికి కాంతిని తీసుకురావచ్చని నిపుణులు అంటున్నారు. క్యాల్షియం, విటమిన్లు, మెగ్నీషియం, ఫైబర్ వంటి అనేక మూలకాలు అరటి తొక్కలో ఉంటాయి. ఇది చర్మంలోని మురికిని తొలగిస్తుంది. అరటి తొక్కతో ముఖానికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అరటి తొక్క వలన కలిగే ప్రయోజనాలు:

  • అరటి తొక్క లోపలి భాగాన్ని ముఖం, మెడపై రుద్దితే.. ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. మురికిని తొలగిస్తుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.
  • అరటి తొక్క లోపలి భాగాన్ని మొటిమలపై రాసి 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి.
  • నల్లటి వలయాలతో ఇబ్బంది పడేవారు అరటి తొక్క లోపలి భాగాన్ని కళ్ల కింద రుద్దండి. దీంతో ఉపశమనం కలుగుతుంది.
  • అరటి తొక్కను ఉపయోగించే ముందు ముఖాన్ని బాగా కడగాలి. అప్పుడు దాన్ని ఉపయోగించాలని గుర్తుచుకోవాలి.

ఇది కూడా చదవండి: పెరుగును నేరుగా ముఖంపై అప్లై చేస్తే ఏం అవుతుందో తెలుసా

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు