Balka Suman: కేసీఆర్ జోలికొస్తే చెప్పుతో కొడతా.. బాల్క సుమన్ షాకింగ్ కామెంట్స్..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ జోలికొస్తే చెప్పుతో కొడతా అని ఉద్వేగపూరితంగా చెప్పు తీసి చూపెట్టారు. సీఎం రేవంత్ తన స్థాయిని త‌గ్గించుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Balka Suman: కేసీఆర్ జోలికొస్తే చెప్పుతో కొడతా.. బాల్క సుమన్ షాకింగ్ కామెంట్స్..!
New Update

BRS Balka Suman: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ జోలికొస్తే చెప్పుతో కొడతా అని పరుషపదజాలాన్ని ఉపయోగించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి త‌న స్థాయిని త‌గ్గించుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యమానికి వెన్నుపోటు పొడిచినా కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్షమించి వదిలేసామన్నారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే రేవంత్ రెడ్డి అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

ఆరు గ్యారెంటీలో ఒక్కటి కూడా..
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలో ఒక గ్యారెంటీని కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శలు గుప్పించారు. డిసెంబ‌ర్ 9న చేస్తామ‌న్న రుణ‌మాఫీ, రూ. 4 వేల పెన్ష‌న్‌, 5 వంద‌ల రూపాయ‌ల గ్యాస్‌, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండ‌ర్ ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నెర‌వేర్చ‌లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు పరిపాలన గాలికి వదిలేసి ఆస్తులు సంపాధించుకునే పనిలో పడ్డారని దుయ్యబట్టారు. హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మరల్చడానికి కేసీఆర్ ని బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ నేతలు తిడుతున్నారన్నారు.

Also Read: టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు..ఇన్ని ఇవాల్సిందే అంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..!

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం గానీ పక్క రాష్ట్రాల వాళ్ళు కానీ మన ప్రాజెక్టుల వైపు చూడాలంటేనే భయపడేవారని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల అధికారాలన్నీ కేంద్రం చేతుల్లోకి పోయాయని ఆరోపించారు. సాగునీరు లేక రాష్ట్రంలో క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి వచ్చిందన్నారు. పరిపాలన సరిగ్గా చేయడం చేతకాక గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారన్నారు.

#telangana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe