సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారు: బాలినేని

మాజీ మంత్రి, ఉమ్మడి ప్రకాశం జిల్లా సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడనున్నారా? సీఎం జగన్‌కు దగ్గరి బంధువైన ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఈ వార్తలపై బాలినేని ఎలా స్పందించారు?

New Update
AP: అందుకే వైసీపీలో ఇబ్బంది పడ్డా.. మాజీ మంత్రి బాలినేని ఎమోషనల్ కామెంట్స్..!

Balineni Srinivasa Reddy: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే తెలియని వారుండరు. వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉంటూ ఆ పార్టీ వ్యవహారాలన్ని చక్కబెడుతూ ఉండేవారు. ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో అయితే ప్రజలు ముద్దుగా వాసన్న అని పిలుచుకుంటారు. గత ఐదు పర్యాయాలుగా ఒంగోలు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇటీవల కాలంలో బాలినేనిపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేయడం సంచలన రేపింది. ఈ క్రమంలోనే ఆయన అక్రమంగా కోట్లు సంపాదించారని.. ఆస్తులు కూడబెట్టారని.. పార్టీ మారబోతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది.

నియోజకవర్గంలోనే బాలినేని.. 

అదే సమయంలో ఉమ్మడి చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కో-ఆర్డినేటర్ పదవి నుంచి ఆయన తప్పుకోవడం కూడా కలకలం రేపింది. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని.. టీడీపీ లేదా జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. ఈ వార్తలపై స్పందించిన బాలినేని సొంత పార్టీ నేతలే తనపై కుట్రలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. ఓ సందర్భంలో అయితే కంటతడి కూడా పెట్టుకున్నారు. నా ప్రాణం ఉన్నంత వరకు జగన్‌తోనే ఉంటానని స్పష్టం కూడా చేశారు. దీంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. అప్పటి నుంచి బాలినేని నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.

వైసీపీకి గుడ్ బై చెబుతున్నారా?

అయితే మళ్లీ రెండు రోజుల నుంచి బాలినేని వైసీపీకి గుడ్‌ బై చెప్పనున్నారనే ప్రచారం మరోసారి తెరమీదకు వచ్చింది. పార్టీ కో-ఆర్డినేటర్ పదవి ఎంపీ విజయసాయిరెడ్డికి ఇవ్వడం, ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యవహారాలను తనకు వదిలేయాలని పదే పదే అడిగినా సీఎం జగన్ ఒప్పుకోకపోవడంతో బాలినేని తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జోరందుకుంది. సీనియర్ నేతైనా తన మాటకు విలువ లేనప్పుడు ఇక పార్టీలో ఉండి ఏం లాభమని.. వేరే దారి చూసుకుంటానని పెద్దలను హెచ్చరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారం బాలినేని దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు.

మైండ్ గేమ్‌ ఆడుతున్నాయి?

తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని.. పార్టీ మారుతున్నట్టుగా సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. ఆవిర్భావం నుంచి వైసీపీలోనే ఉన్నానని.. ప్రతిపక్షాలు మైంగ్ గేమ్ ఆడుతున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్ నాయకత్వంలోనే పనిచేయనున్నట్లుగా మరోసారి స్పష్టంచేశారు. మొత్తానికి బాలినేని పార్టీ మారబోతున్నారనే వార్తలు మాత్రం ఆగడం లేదు. కానీ ప్రతిపక్షాలు మాత్రం నిప్పు లేనిదే పొగ రాదు కదా? అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు