బీహార్ రాష్ట్రంలోని కొత్వాలి పీఎస్ పరిధిలోని ఇక్బాల్‌నగర్‌కు చెందిన వ్యక్తికి గతంలోనే పెళ్లయింది. తాజాగా మరో యువతితో మ్యారేజ్‌కు రెడీ అయ్యాడు ఈ మహా కేటుగాడు. అయితే కాసేపట్లోనే పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే పెనుతుఫాన్ చెలరేగింది. అంతలోనే అక్కడున్న పెళ్లి కొడుక్కి గతంలోనే మ్యారేజ్ అయిందన్న విషయం వధువు కుటుంబానికి తెలిసింది. ఇంకేముంది... ఆగ్రహంతో కట్టలు తెంచుకున్న బంధువులు ఊగిపోయారు.
మండపానికి చేరుకున్న వరుడితో వాగ్వాదం
వరుడిగా ముస్తాబై మండపానికి చేరుకున్న వరుడితో వాగ్వాదానికి దిగారు. మాయమాటలు, అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటావా అంటూ చెంపలు పగులగొట్టి చితకబాదారు. ఇంకా బ్యాడ్ లక్ ఏంటంటే అదే సమయంలో వరుడి విగ్గు ఊడి కిందపడటంతో బట్టతల బండారం కాస్తా బయటపడింది. దీంతో మరింతగా రెచ్చిపోయారు. వరుడు పలుమార్లు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా ఛాన్స్ లేకుండా వరుడి మాట వినకుండా చావ బాదేశారు.
తనను వదిలేయమని పెళ్లి కొడుకు ప్రాధేయపడినా
పెళ్లి కొడుకు తనను వదిలేయమని ప్రాధేయపడినా వదల్లేదు. వరుడి బంఢారం కాస్త బయటపడటంతో బంధువుల ఆగ్రహానికి బలయ్యాడు. ఈ తతంగం అంతా.. బీహార్ రాష్ట్రంలోని గయ జిల్లాలోని డోభీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతూ దుమ్మురేపుతోంది. ఎంతేమైనా అతిగా ఆశపడి పెళ్లి మండపంలో భంగపాటుకు గురైనా ఘటనతో మనోడి భాగోతం అంతా పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లి అసలు పెళ్లి చేశారు.