Bala Krishna: అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. వైసీపీ మంత్రులకు బాలయ్య వార్నింగ్

వైసీపీపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో ధ్వజమెత్తారు. కొందరు కోడిగుడ్డుపై ఈకలు పీకే బ్యాచ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదని హెచ్చరించారు.

New Update
Bala Krishna: అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. వైసీపీ మంత్రులకు బాలయ్య వార్నింగ్

Bala Krishna: టాలీవుడ్ స్టార్ సీనియర్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాడేపల్లిగూడెం సభలో ప్రసంగించారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ప్రజా సంక్షేమం కోసం విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలను అధికారం పీఠంపై ఎక్కించారని అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా ఎన్టీఆర్ చూపిన బాటలోనే పార్టీని ముందుకు తీసుకెళుతున్నారని చెప్పుకొచ్చారు. టీడీపీకి ఉన్న బలం కార్యకర్తలేనని బాలయ్య వ్యాఖ్యానించారు.

Also Read: క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాలా ప్రమాదం.. నిర్దారించిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ!

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం, పలువురు మంత్రులపై తనదైన శైలిలో ధ్వజమెత్తారు.  వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, రాష్ట్రంలో రైతు ఉనికే లేకుండా చేస్తోందని ఫైర్ అయ్యారు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అంటూ శ్రీ శ్రీ కవితను గుర్తు చేశారు. ఏపీలో పాలన కూడా ఇదే తరహాలో ఉందని కామెంట్స్ చేశారు. టీడీపీ చేసిన మంచి పనులను మెచ్చుకోకుండా, తాము ఏమీ చేయకుండా, కొందరు కోడిగుడ్డుపై ఈకలు పీకే బ్యాచ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని బాలయ్య ధ్వజమెత్తారు.

Also Read: తెలంగాణలో 24 గంటలు కరెంట్..మన రాష్ట్రంలో నాలుగైదు గంటలకు కూడా లేదు: మాజీ ఎమ్మెల్యే

మేం చేసింది ఏమిటో చూపిస్తాం.. మీరేం చేశారో చూపించండి.. చర్చిద్దాం అంటే రారు.. అధికారం ఉంది కదా అని మాట్లాడితే ఎలా అంటూ ప్రశ్నించారు. బ్రిటీష్ పాలన తరహాలో కులాలు, మతాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇవాళ తాడేపల్లిగూడెం సభకు హాజరైన జన సందోహాన్ని చూస్తుంటే టీడీపీ-జనసేన కూటమి గెలుపు తథ్యం అని చెప్పవచ్చన్నారు. ఓటు అనే ఆయుధాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు