/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Balashowry-.jpg)
కేంద్ర కేబినెట్‌లోకి జనసేన మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి బెర్త్ ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాల్లో జనసేన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి, కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ కంటే బాలశౌరి సీనియర్ కావడంతో ఆయనకే పదవి వరిస్తుందని ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్‌కు బాలశౌరి అత్యంత సన్నిహితుడు కావడం కూడా ఆయనకు ప్లస్ పాయింట్ గా మారింది. ఎంపీగా అభివృద్ధి, మంచి పనులు చేశాడన్న టాక్ ఉండడం కూడా ఆయనకు కలిసొచ్చే అంశంగా మారింది. కేంద్రంలో జనసేనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా బాలశౌరికి అవకాశం ఉంటుందన్న ప్రచారం సాగుతోంది.