Balapur Ganesh Laddu Auction 2023: బాలాపూర్ లడ్డూకు భలే డిమాండ్.. గత తొమ్మిదేళ్లుగా పలికిన ధరల వివరాలివే!

బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం రేపు జరగనుంది. గతేడాది అత్యధికంగా రూ.24.60 లక్షల రికార్డు ధర పలకడంతో ఈ సారి అంతకు మించి పలికే అవకాశం ఉంది. ఈ సారి రూ.30 లక్షలు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

New Update
Balapur Ganesh Laddu Auction 2023: బాలాపూర్ లడ్డూకు భలే డిమాండ్.. గత తొమ్మిదేళ్లుగా పలికిన ధరల వివరాలివే!

గణేశ్‌ నవరాత్రులు అనగానే తెలుగు రాష్ట్రాల్లోని భక్తుల్లో రెండు ఆసక్తికర ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. అందులో మొదటిది.. ఈ సారి ఖైరతాబాద్ గణేశుడి (Khirathabad Ganesh) ఎత్తు ఎంత?, రెండవది బాలానగర్ గణేశుడి లడ్డూ (Balapur Ganesh Laddu Price) ధర ఈ సారి ఎంత?. ఈ నేపథ్యంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా రేపు బాలాపూర్ లడ్డూ వేలం జరగనుంది. దీంతో ఈ సారి ధర ఎంత పలకవచ్చనే అన్న అంశంపై భక్తుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక్కడి లడ్డూను వేలంలో సొంతం చేసుకున్న వారికి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో వ్యాపారులు, రాజకీయ ప్రముఖులు సైతం వేలంలో పాల్గొనడానికి అత్యంత ఆసక్తి చూపుతుంటారు. ఈ వేలాన్ని చూడడానికి కూడా భక్తులు సైతం భారీగా తరలి వస్తుంటారు. గతేడాది అత్యధికంగా రూ.24.60 లక్షల రికార్డు ధర పలకడంతో ఈ సారి అంతకు మించి పలికే అవకాశం ఉంది. ఈ సారి బాలాపూర్ లడ్డూ ధర రూ.30 లక్షలు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Khairatabad Ganesh: రేపు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సాగేది ఎలాగంటే..?

2014 నుంచి బాలాపూర్ లడ్డూను వేలంలో దక్కించుకున్న వారి పేర్లు, పలికిన ధర వివరాలు ఇలా ఉన్నాయి..
2014- సింగిరెడ్డి జైహింద్ రెడ్డి - రూ.9.50 లక్షలు
2015- కళ్లెం మదన్ మోహన్ రెడ్డి - రూ.10.32 లక్షలు
2016- స్కైలాబ్ రెడ్డి - రూ.14.65 లక్షలు
2017- నాగం తిరుపతి రెడ్డి - రూ.15.60 లక్షలు
2018- శ్రీనివాస్ గుప్తా - రూ.16.60 లక్షలు
2019- కొలను రామిరెడ్డి - రూ.17.60 లక్షలు
2020 - కరోనా కారణంగా వేలం పాట జరగలేదు
2021 - మర్రి శశాంక్ రెడ్డి, రమేశ్ యాదవ్- రూ.18.90 లక్షలు
2022 -పొంగులేటి లక్ష్మారెడ్డి - రూ.24.60 లక్షలు

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం కోసం పోలీసులు, అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత కోసం 25 వేల మంది పోలీసులను మోహరించారు. ఇప్పటికే ఈ మేరకు రూట్ మ్యాప్ ను కూడా విడుదల చేశారు.

Advertisment
తాజా కథనాలు