ఏపీ ఎన్నికల ప్రచారంలో బాలయ్య!స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బస్సుయాత్ర!

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం లక్ష్యంగా హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ త్వరలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. స్వర్ణాంధ్ర సాకార పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రను బాలకృష్ణ చేయనున్నారు.

ఏపీ ఎన్నికల ప్రచారంలో బాలయ్య!స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బస్సుయాత్ర!
New Update

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి సినీ హీరో నందమూరి బాలకృష్ణ  స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో  బస్సు యాత్ర చేయనున్నారు. రేపటి నుంచే బస్సు యాత్ర ప్రారంభం కానున్నట్లు సమాచారం. మరోవైపు యాత్ర కోసం ప్రత్యేకంగా రూపొందించిన బస్సు ఆకట్టుకుంటోంది. ఇప్పటికే చంద్రబాబు, భువనేశ్వరి , లోకేష్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండగా.. బాలయ్య ఎంట్రీతో టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకుపోనుంది.కాగా టీడీపీ విజయం కోసం రాష్ట్రవ్యాప్తంగా బాలయ్య బస్సు యాత్ర చేయనున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో నందమూరి బాలకృష్ణ బస్సు యాత్ర సాగనుంది.

బాలయ్య చేపట్టనున్న బస్సు యాత్ర కోసం ఇప్పటికే ప్రత్యేక బస్సును కూడా సిద్ధం చేశారు. బాలయ్య అన్ స్టాపబుల్ అంటూ బస్సుపై ప్రత్యేక క్యాప్షన్ కూడా ఇచ్చారు. అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి లోగోను ముద్రించారు. మొత్తం బస్సును టీడీపీ కలర్ అయిన పసుపు రంగుతో ముంచేశారు. అలాగే బస్సు మీద నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలను ముద్రించారు.నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర శనివారం కదిరిలో ప్రారంభం కానుంది. తొలి విడతలో ఉమ్మడి అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలలో బాలయ్య బస్సు యాత్ర సాగనుంది. ఏప్రిల్ 13న కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలలో బస్సు యాత్ర జరగనుంది. కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పూజల అనంతరం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అలాగే ఏప్రిల్ 14న శింగనమల నియోజకవర్గంలోని కల్లూరు, అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌ మీదుగా యాత్ర సాగనుంది. మరోవైపు టీడీపీ తరుఫున చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా లోకేష్ ఇప్పటికే ప్రచారం చేస్తుండగా.. తాజాగా బాలయ్య కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు.

చంద్రబాబు ప్రజాగళం, నారా భువనేశ్వరి నిజం గెలవాలి, లోకేష్ శంఖారావం సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ సైతం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.మరోవైపు 2024 ఎన్నికల్లో శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నుంచి బాలకృష్ణ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇప్పటికే ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచిన బాలకృష్ణ.. హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో స్థానిక వైసీపీలో వర్గపోరు కూడా బాలయ్యకు కలిసి వస్తోంది. ఈ వర్గపోరు కారణంగానే గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థిగా బాలకృష్ణ మీద పోటీ చేసిన మహ్మద్ ఇక్బాల్.. ఈసారి టీడీపీ గూటికి చేరారు. ఇటీవలే తన ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేసి ఇక్బాల్ టీడీపీలో చేరిపోయారు. మహ్మద్ ఇక్బాల్ చేరిక హిందూపురంలో టీడీపీకి లాభిస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి దీపిక బరిలో ఉన్నారు. మరి బాలయ్య హ్యాట్రిక్ కొడతారా.. టీడీపీ కంచుకోట అయిన హిందూపురంలో వైసీపీ జెండా ఎగురుతుందా అనేది చూడాలి మరి.

#swarnandhra-sakara-yatra #nandamuri-balakrishna
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe