Balakrishna: భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్ కన్ఫామ్..!!

'భగవంత్ కేసరి'తో బాలయ్యకి హ్యాట్రిక్ హిట్ కన్ఫామ్ అంటున్నారు నందమూరీ అభిమానులు. నేలకొండ భగవంత్ కేసరి'గా బాలయ్య నటించనున్న విషయం తెలిసిందే. తండ్రీకూతుళ్ల ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ. అందులోనూ అనిల్ రావిపూడి టేకింగ్ పై అందరిలోనూ విపరీతమైన నమ్మకం. అంతేకాకుండా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తోంది. సో కచ్చితంగా ఈ నెల 19వ తేదీన విడుదలవుతున్న 'భగవంత్ కేసరి' సూపర్‌ హిట్ అవుతోందని ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

New Update
Balakrishna: భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్ కన్ఫామ్..!!

Balakrishna: 'భగవంత్ కేసరి'తో బాలయ్యకి హ్యాట్రిక్ హిట్ కన్ఫామ్ అంటున్నారు నందమూరీ అభిమానులు.  ‘మరో రెండు రోజుల్లో అంటే అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ చిత్రంలో హీరోగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా టికెట్ల బుకింగ్ కూడా జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో భగవంత్ కేసరి సినిమాకు సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ సర్టిఫికషన్ వచ్చేసింది.

publive-image

మొదటి నుంచి కూడా బాలకృష్ణ తన సినిమాలో యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. ఒకదశ తరువాత ఆ రెండూ మరింత బలంగా ఉండేలా చూసుకుంటున్నారు. 'అఖండ' .. 'వీరసింహా రెడ్డి' సినిమాల విషయంలోను ఈ సంగతి మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేశాయి.

publive-image

ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి 'భగవంత్ కేసరి' రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో 'నేలకొండ భగవంత్ కేసరి' అనే పవర్ఫుల్ పాత్రలో బాలయ్య కనిపించనున్నారు. పాత్ర పరంగా కూడా NBK వచ్చేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేయడం విశేషం. ఇంతవరకూ ఫ్లాప్ మాట వినని ఆయన నుంచి వస్తున్న ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.

Also Read: నేషనల్ అవార్డ్ అందుకున్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు