Bhagavanth Kesari: ఓటీటీ లో బాలయ్య భగవంత్ కేసరి..!

దర్శకుడు అనిల్ రావి పూడి, బాలకృష్ణ నటించిన చిత్రం భగవంత్ కేసరి . బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య ఈ సినిమా నవంబర్ 24 న ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

Bhagavanth Kesari:  ఓటీటీ లో బాలయ్య భగవంత్ కేసరి..!
New Update

Bhagavanth Kesari: డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలకృష్ణ(Balakrishna) కాంబినేషన్ విడుదలైన భగవంత్ కేసరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లు వసూళ్లు చేసి మంచి విజయాన్ని అందుకుంది. బాలయ్య అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అక్టోబర్ 19 విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ పొందింది. బాక్స్ ఆఫీస్ (Box Office) వద్ద భారీ విజయంతో దుమ్ము లేపిన బాలయ్య 'భగవంత్ కేసరి' ఓటీటీ(OTT) ప్రేక్షకులను అలరించడానికి నవంబర్ 24 న ఓటీటీ వేదికైన అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

publive-image

ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఈ నెల 24 న సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. కామెడీ జానర్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ అలరించే అనిల్ రావిపూడి వాటికి భిన్నంగా 'భగవంత్ కేసరి' సినిమాతో మాస్ ఆడియన్స్ ను మెప్పించారు. ఈ సినిమాలో బాలయ్య డైలాగ్స్, శ్రీలీల నటన సినిమాకు మేజర్ ప్లస్ గా నిలిచాయి. డైరెక్టర్ అనిల్ రావి పూడి భగవంత్ కేసరి చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంది.

publive-image

publive-image

Also Read: Bigg Boss Manas Marriage: ఘనంగా బిగ్ బాస్ ఫేమ్ మానస్ పెళ్లి వేడుకలు.. సన్నీ, కాజల్ సర్ ప్రైజ్ గిఫ్ట్..!

#bhagavanth-kesari-ott-release #bhagavanth-kesari-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe