Balagam : ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో సత్తా చాటిన 'బలగం'.. ఏకంగా అన్ని కేటగిరీల్లో నామినేట్..!

2024 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్ లో 'బలగం' సినిమా స‌త్తా చాటింది. ఈ సినిమా ఏకంగా 8 కేటగిరీల్లో నామినేట్ అయ్యింది. ఈ విష‌యాన్ని నిర్మాత దిల్ రాజ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. త్వరలోనే ఈ అవార్డు ఫలితాలను ఫిలిం ఫేర్ అధికారికంగా ప్రకటించనుంది.

Balagam : ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో సత్తా చాటిన 'బలగం'.. ఏకంగా అన్ని కేటగిరీల్లో నామినేట్..!
New Update

Balagam Movie Nominated 8 Categories In 2024 Film Fare Awards : జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమౌతూ తెరకెక్కించిన 'బలగం' సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలంగాణ గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాలను ఎంతో ఎమోషనల్ గా కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమాలో చూపించిన విధానానికి యావత్ తెలుగు ప్రేక్షకులు దాసోహం అయిపోయారు.

మొదట్లో చిన్న సినిమాగా విడుదలైన 'బలగం'.. ఆ తర్వాత అంచనాలకు మించి విజయాన్ని అందరి ప్రశంసలను అందుకుంది.ఒక కమెడియన్ ఇలాంటి ఓ ఎమోషనల్ సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమాతో దర్శకుడిగా వేణుకి ఎంతో మంచి గుర్తింపు లభించింది. కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్న 'బలగం' సినిమాకి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కూడా దక్కాయి.

Also Read : హాస్పిటల్ లో చేరిన ఆర్. నారాయణ మూర్తి.. పీపుల్ స్టార్ కు ఏమైందంటే?

8 కేటగిరీల్లో...

ఈ సినిమాకి సుమారు వందకు పైగా అవార్డ్స్ వచ్చినట్లు చిత్ర యూనిట్ ఓ సందర్భంలో వెల్లడించారు. తాజాగా ఈ చిత్రం 2024 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్ స‌త్తా చాటింది. ఈ చిత్రం ఏకంగా 8 కేటగిరీల్లో నామినేట్ అయ్యింది. ఈ విష‌యాన్ని నిర్మాత దిల్ రాజ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు, ఉత్తమ స‌హ‌య నటుడు, ఉత్త‌మ సంగీతం, ఉత్త‌మ లిరిక్స్, ఉత్తమ స‌హ‌య నటితో పాటు ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్( మేల్, ఫిమేల్) కేట‌గిరీల్లో ఈ మూవీ నామినేట్ అయ్యింది. త్వరలోనే ఈ అవార్డు ఫలితాలను ఫిలిం ఫేర్ అధికారికంగా ప్రకటించనుంది.

#film-fare-awards-2024 #balagam-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe