బీజేపీకి సపోర్ట్ కోసమే చంద్రబాబుకి బెయిల్‌..సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు.!

రాష్ట్రంలో కరువు పరిస్థితులపై విజయవాడలో సీపీఐ చేపట్టిన నిరసన దీక్ష రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ..కేవలం బీజేపీకి సపోర్ట్ చేసేందుకే చంద్రబాబుకి బెయిల్‌ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
CPI Narayana: కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ ఓడిపోతాయి.. సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు

CPI Narayana: కృష్ణా జలాల పంపిణీ, రాష్ట్రంలో కరువు పరిస్థితులపై విజయవాడ అలంకార్ సెంటర్లో సీపీఐ నిర్వహిస్తున్న 30 గంటల నిరసన దీక్ష రెండో రోజు కొనసాగింది. సీపీఐ చేస్తున్న దీక్షలకు వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ..18 జిలాల్లో పర్యటించి కరువు సమస్యలపై అధ్యయనం చేసి 30 గంటల దీక్షకి సీపీఐ పునుకోందని తెలిపారు. కరువుని అత్యవసరంగా చూడాలని డిమాండ్ చేశారు. కృష్ణ జలాలను రాయలసీమకి తరలించాలని కోరారు. విభజన చట్టంలో వెనకబడిన ప్రాంతాలకు 50 కోట్లు ఇవ్వాలని ఉంది.. కానీ ఎక్కడ అమలు చేయలేదని వ్యాఖ్యనించారు.

ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ బలమైన పార్టీ.. ఆలాంటి బలమైన పార్టీ ఇంకా ఏ రాష్టంలోనూ లేదు..వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో పోరాటం చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరిగేదని అన్నారు. కానీ, తన కుటుంబంలో ఉన్న నేరస్తులను కాపాడు కోవడం కోసమే జగన్ కేంద్రం కాళ్ళు పట్టుకొంటున్నాడని ఎద్దెవ చేశారు. దేశంలో సుదీర్ఘ కాలం బెయిల్ పై ఉన్న వ్యక్తి జగన్ తప్ప ఎవరూ లేరని అన్నారు. జగన్ ని కేంద్రం బ్లాక్ మెయిల్ చేస్తుందని ఆరోపించారు.

Also Read: బాధితులకు వందకు వందశాతం నష్టపరిహారం చెల్లించాల్సిందే.!

కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న వైసీపీపై ప్రజలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కరువు అంశంపై బంద్ కి పిలుపునిస్తామని అన్నారు. జగన్ కుంభకర్ణుడని..ప్రతినెల ఢీల్లి వెళ్లి మోడీ, అమిత్ షా కాళ్ళు పట్టుకొంటున్నాడని విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ కేంద్ర పెద్దలతో మాట్లాడేటప్పుడు మీడియా వాళ్ళను కూడా తీసుకొని వెళ్ళాలని అన్నారు. మూడు ముక్కలాటతో జగన్ ఆటలాడుతున్నాడని అన్నారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు బెయిల్ విషయంపై మాట్లాడారు. తెలంగాణలో బీజేపీకి సపోర్ట్ చేయాలనే కండిషన్ తోనే చంద్రబాబుకి బెయిల్ వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, చంద్రబాబు తలకిందులుగా తప్పస్సు చేసిన టీటీడీపీ శ్రేణులు కాంగ్రెస్ కె ఓటు వేస్తారని.. బీజేపీకి ఏ మాత్రం సపోర్ట్ చేయరని అన్నారు. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ.. ఆయన సినిమా యాక్టర్.. ఆయన గురించి ఏం మాట్లాడతాం అని మాటదాటేశారు.

Advertisment
తాజా కథనాలు