Hyderabad: రేపు హైదరాబాద్ లో మటన్ చికెన్ షాప్స్ బంద్.. రీజన్ ఇదే

ఈ ఆదివారం ముక్క లేకుండానే ముద్ద తినాల్సిన పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ నగరంలో ఏప్రిల్ 21వ తేది నాడు అన్నీ మటన్, చికెన్ షాపులు మూసివేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే మటన్, చికెన్ విక్రయాలు బంద్ చేయడానికి కారణం ఇదే.

New Update
Hyderabad: రేపు హైదరాబాద్ లో మటన్ చికెన్ షాప్స్ బంద్.. రీజన్ ఇదే

SUNDAY వస్తే ఏం ఉన్నా లేకపోయినా ఇంట్లో నాన్ వెజ్ మాత్రం తప్పకుండా ఉండాలి. ఎందుకంటే చాలా మంది వర్క్ హాలిడే, జాబ్ హాలిడే కారణంగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి మాంసాహారం తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఈసంప్రదాయ చాలా కాలంగా వస్తోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో సండే నాన్ వెజ్ తినే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది.అయితే అన్నీ ఆదివారాలు ఒకలా ఉండవు కదా. ఈసారి SUNDAY మాత్రం నాన్ వెజ్ లవర్స్ కి ఈవిషయంలో బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈసారి ఆదివారం మాంసం విక్రయాలు బంద్ చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలోని అన్నీ ప్రాంతాల సంగతి ఏమో కాని హైదరాబాద్ నగరం గ్రేటర్ లిమిట్స్ లో ఉండే మటన్ , చికెన్ షాపులతో పాటు కభేళాలు, మీట్ మార్కెట్స్ అన్నీ బంద్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనల్  రొనాల్డ్ రాస్ ..ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఏప్రిల్ 21వ తేది ఆదివారం జైనుల మత గురువు మహావీర్ జయంతి వచ్చింది. ఈసందర్భంగా జైనుల పండుగలో ముఖ్యమైనది మహావీర్ జయంతి కావడంతో  ఏప్రిల్ 21వ తేది  అనగా రేపు ఆదివారం మటన్ విక్రయాలు నిలిపివేయాలని సిటీలోని జైన్ భక్తులు కోరడంతో ఈనిర్ణయం తీసుకోవడం జరిగింది.

మహావీర్ జయంతి సందర్భంగా ఈ నెల 21న సిటీలోని అన్ని కబేళాలతో పాటు మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. ఈమేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కబేళాలు, మాంసం దుకాణాలను ఆదివారం బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.సండే వస్తే డిఫరెంట్ నాన్ వెజ్ డిసెష్ ప్లాన్ చేసుకునే నగరవాసులకు ఇదొక బ్యాడ్ న్యూస్. మహావీరుడి జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని కబేళాలతో పాటు మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశించినట్లు రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉత్తర్వులను ఎవరైనా బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు అధికారులు. మహావీర్ జయంతి ఈసారి ఆదివారం రావడంతో నాన్ వెజ్ లవర్స్ కి టేస్టీ ఫుడ్ తినలేకపోవడానికి కారణమైంది. అధికారుల ఉత్తర్వులతో సండే రోజు మటన్ షాపులు జనం లేక వెలవెలబోతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు