బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన 'బేబీ' మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

ఇటీవల విడుదలైన చిన్న సినిమాలు పెద్ద విజయం సాధిస్తున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు స్టార్ హీరోల సినిమాలకు వచ్చినట్లు కలెక్షన్స్ వస్తున్నాయి. అలాంటి కోవలో 'బేబీ' చిత్రం చేరింది. మౌత్ పబ్లిసిటీతో తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర ఊహించని వసూళ్లు రాబట్టి శభాష్ అనిపించింది. ఆనంద్ దేరకొండ కెరీర్‌లోనే మైలురాయి చిత్రంగా నిలిచిపోయింది.

New Update
బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన 'బేబీ' మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

publive-image

తొలిరోజు దుమ్మురేపే కలెకన్స్.. 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన చిత్రం 'బేబీ'. యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో విరాజ్ అశ్విన్, నాగబాబు, వైవా హర్ష, సీత కీలక పాత్రలను చేశారు. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. నేటి కాలం యువతకు కనెక్ట్ అయ్యే ప్రేమ కథ కావడంతో యూత్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపే కలెక్షన్స్ రాబడుతోంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

publive-image

బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం.. 

తొలిరోజే బేబీ చిత్రానికి కాసుల వర్షం కురవడంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌లో ఉంది. ఇటీవల కాలంలో కంటెంట్ బాగున్న చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా సూపర్ ఓపెనింగ్స్ దక్కించుకుంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. కోటి.. ఇలా ప్రపంచవ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ చేసిందని చెబుతున్నారు. దీంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాంటే రూ.8కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాలి. అయితే సూపర్ హిట్ టాక్ రావడంతో తొలిరోజే సగం రికవరీ చేసినట్లు తెలిపారు. ఇక వీకెండ్ కావడంతో ఈజీగా బ్రేక్ ఈవెన్ దాటి భారీ లాభాల్లోకి రావడం ఖాయంటున్నారు.

ఓసారి ఏరియా వారీగా వసూళ్లను పరిశీలిస్తే..

నైజాంలో రూ. 1.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 31 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 42 లక్షలు, తూర్పు గోదావరి రూ. 18 లక్షలు, పశ్చిమ గోదావరి రూ. 11 లక్షలు, గుంటూరు రూ. 15 లక్షలు, కృష్ణా రూ. 15 లక్షలు, నెల్లూరు రూ. 8 లక్షలతో కలిపి.. రూ. 2.60 కోట్లు షేర్, రూ. 4.65 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 16 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 72 లక్షలు రాబట్టింది. దీంతో మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.48 కోట్లు షేర్‌, రూ. 7.10 కోట్లు గ్రాస్ రాబట్టింది.

publive-image

ఆనంద్ కెరీర్‌లోనే మైలురాయి చిత్రం 

మొత్తానికి ప్రేక్షకుల అద్భుతమైన స్పందనతో ఆనంద్ దేవరకొండ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ వచ్చిన చిత్రంగా 'బేబీ' నిలిచింది. అతడు చేసిన సినిమాల్లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోనుందని క్రిటిక్స్ చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు