Boycott Patanjali : బాబారాందేవ్‌ 'ఓబీసీ' వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో దుమారం.. ట్రెండింగ్‌లో 'బాయ్‌కాట్‌ పతంజలి'

యోగా గురువు బాబారాందేవ్‌ 'ఓబీసీ'లను అవమానించేలా ఉన్న ఓ వీడియో వైరల్‌ అయ్యింది. అయితే తాను ఓబీసీలను అనలేదని.. ఓవైసీని అన్నానని రాందేవ్‌ చెప్పుకొచ్చారు. అయితే ఇది కవర్‌ డ్రైవ్‌లాగా ఉందని భావించిన ఓ వర్గం నెటిజన్లు 'బాయ్‌కాట్‌ పతంజలి' హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు.

New Update
Boycott Patanjali : బాబారాందేవ్‌ 'ఓబీసీ' వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో దుమారం.. ట్రెండింగ్‌లో 'బాయ్‌కాట్‌ పతంజలి'

Patanjali : యోగా(Yoga) గురు బాబారాందేవ్‌(Baba Ramdev) నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకొని ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన పేరు ఎక్కువగా వినపడడం లేదు. గతంలో వినపడినప్పుడు కూడా ఏదో ఒక వివాదం కారణంగానే వినపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యోగాసనాల కంటే కూడా మాటాసనాలతోనే వార్తల్లో నిలుస్తుంటారు ఈ యోగా గురువు.. తాజాగా మారోసారి అదే జరుగుతోంది. ఓ 'ఓబీసీ'లను తక్కువ చేసేలా మాట్లాడిన బాబారాందేవ్‌ సోషల్‌మీడియా(Social Media) లో రేగిన దుమారం తర్వాత కవర్‌ డ్రైవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. తాను ఓబీసీలను అనలేదని.. AIMIM చీఫ్‌ ఓవైసీని అన్నానని చెప్పుకొచ్చారు. అయితే ఆయన మాటలు నమ్మేలాలేవని భావించిన ఓ వర్గం నెటిజన్లు.. 'బాయ్‌కాట్‌ పతంజలి' హ్యాష్‌ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు.


వైరల్ వీడియోలో రామ్‌దేవ్ ఏం అన్నారంటే?
సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేయడం ద్వారా, యోగా గురువు ఓబీసీ కమ్యూనిటీ(OBC Community) ని అవమానిస్తున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. 'నా అసలు గోత్రం బ్రహ్మ గోత్రం. నేను అగ్నిహోత్రి బ్రాహ్మణుడిని. ప్రజలు బాబాజీ, మీరు OBC అని అంటారు. OBC ప్రజలు నన్ను అలాంటివి చేసేలా చేస్తారు. నేను వేది బ్రాహ్మణుడిని, నేను ద్వివేదిని' అని రామ్‌దేవ్ వీడియోలో అంటున్నారు. 'బ్రాహ్మణుడు, నేను త్రివేది బ్రాహ్మణుడిని, నేను చతుర్వేది బ్రాహ్మణుడిని, నేను నాలుగు వేదాలు చదివాను..' అని రాందేవ్‌ అంటున్నట్టు వీడియోలో వినిపిస్తోంది.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బాబా రామ్‌దేవ్‌పై పలువురు పోస్ట్‌లు చేశారు. ఓబీసీ వర్గాన్ని అవమానించినందుకు రామ్‌దేవ్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో దుమారం రేగడంతో బాబా రామ్‌దేవ్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓబీసీలను అనలేదని.. 'ఒవైసీ'ని అన్నానని చెప్పారు. 'మేము అలాంటి ప్రకటనలు ఇవ్వలేదు. ఒవైసీ, అతని పూర్వీకులు ఎప్పుడూ దేశ వ్యతిరేక ఆలోచనలతో ఉన్నారని, మేము దానిని సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం లేదు, మేము ఎప్పుడూ OBC లకు వ్యతిరేకంగా మాట్లాడలేదు' అని చెప్పుకొచ్చారు. ఈ వీడియో వైరల్‌గా మారిన తర్వాత, 'బాబా రామ్‌దేవ్ క్షమాపణలు చెప్పండి', 'పతంజలిని బహిష్కరించండి' మొదలైనవి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Also Read: ఆ ఇద్దరి కెరీర్‌ ముగిసినట్టేనా? ఫేర్‌వెల్‌ మ్యాచైనా ఆడనిస్తారా?