Baahubali Scene In Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో బాహుబలి సీన్ ఆసిఫాబాద్ జిల్లాలో బాహుబలి సీన్ రీపిట్ అయింది. లక్మాపూర్‌లో జ్వరంతో బాధపడుతున్న చంటి బిడ్డను తన చేతుల్లో పట్టుకుని వాగు దాటాడు ఓ వ్యక్తి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామ శివారులోని వాగు ఉప్పొంగుతోంది. చిన్నారి పరిస్ధితి విషమించడంతో రిస్క్ చేసి మరి ఆస్పత్రికి తరలించారు. By Jyoshna Sappogula 07 Sep 2023 in Latest News In Telugu ఆదిలాబాద్ New Update షేర్ చేయండి Baahubali Scene In Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో బాహుబలి సీన్ రీపిట్ అయింది. బహుబలి సినిమా అంటే తెలియని వారు ఉండరు. మహేంద్ర బాహుబలిని కాపాడేందుకు శివగామి తన చేతిలో పట్టుకుని నదిని దాటింది. సేమ్ ఆదే సీన్ లక్మాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. రాథోడ్ కృష్ణ, సుజాత దంపతుల కూతురు (8 నెలలు) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామ శివారులోని వాగు ఉప్పొంగుతోంది. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దీంతో పాపను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మూడు రోజులు వేచి చూశారు. అయినప్పట్టికి వర్షాలు, వాగులోని నీరు ఏమాత్రం తగ్గుమకం పట్టలేదు. చిన్నారి పరిస్ధితి చూసిన తల్లిదండ్రలు ఆందోళనలో పడ్డారు. అసంపూర్తిగా ఉన్న వంతెనతోనే ఆస్పత్రికి ఎలా తీసుకువెళ్లాలని మదనపడ్డారు. మరోవైపు చిన్నారి పరిస్ధితి మరింత విషమించింది. ఇక రిస్క్ చేయక తప్పలేదు. ఎలాగైన ఆస్పత్రికి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. తండ్రి కృష్ణ తన తమ్ముడు సాయిప్రకాశ్‌ను తీసుకుని బయల్దేరారు. అయితే వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చిన్నారిని తన చేతుల్లో పట్టుకుని వాగు దాటాడు సాయిప్రకాశ్. తర్వాత చిన్నారి తల్లిదండ్రులు కూడా వాగుదాటి వచ్చారు. అధికారుల నిర్లక్ష్యంతో అవస్ధలు..! అనంతరం ముగ్గురూ కెరమెరి మండలంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చిన్నారికి చికిత్స చేయించారు. తిరిగి ఇదే రీతిలో వాగుదాటి ఇంటికి వెళ్లారు. కాగా, ఈ వాగుపై 2016లో వంతెన నిర్మాణం ప్రారంభించారు. అధికారుల నిర్లక్ష్యం లోపంతో ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని స్ధానిక గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రతి సంవత్సరం వానలు, వరదలు వచ్చినప్పుడు అవస్థలు తప్పడం లేదంటు ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామ శివారులోని వాగు ఉప్పొంగుతోంది. జ్వరంతో బాధపడుతున్న చంటి బిడ్డను చేతులపై ఎత్తుకుని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటాల్సిన పరిస్ధితి వచ్చిదంటే.. ఆ ప్రాంత ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అర్ధమవుతోంది. అధికారులు ఇప్పటికైన స్పందించి వంతెనను పూర్తిగా నిర్మించాలని లక్మాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి