బాహుబలి 2 రికార్డ్ ను బద్దలుకొట్టిన చిన్న సినిమా

సన్నీ డియోల్ నటించిన గదర్ 2 బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం ట్రేడ్‌ని ఆశ్చర్యపరచడమే కాకుండా, 22 ఏళ్ల కిందట వచ్చిన చిత్రానికి సీక్వెల్ గా వచ్చి, ఇంత భారీ బ్లాక్‌బస్టర్ అవుతుందని ఊహించని ప్రేక్షకులకు కూడా షాక్ ఇచ్చింది.

New Update
బాహుబలి 2 రికార్డ్ ను బద్దలుకొట్టిన చిన్న సినిమా

సన్నీ డియోల్ నటించిన గదర్ 2 బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం ట్రేడ్‌ని ఆశ్చర్యపరచడమే కాకుండా, 22 ఏళ్ల కిందట వచ్చిన చిత్రానికి సీక్వెల్ గా వచ్చి, ఇంత భారీ బ్లాక్‌బస్టర్ అవుతుందని ఊహించని ప్రేక్షకులకు కూడా షాక్ ఇచ్చింది. గదర్ 2 హిందీ సినిమా బాలీవుడ్ ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో రెండవ శనివారం అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టింది.

మొదటి వారంలో సంచలనం సృష్టించిన గదర్ 2... రెండో వారాంతంలో కూడా దూసుకుపోతోంది. తన దారికి అడ్డం వచ్చిన ప్రతి రికార్డును బద్దలు కొడుతోంది. రెండో శనివారం అత్యథిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇప్పటివరకు బాహుబలి-2ది మాత్రమే రికార్డ్. ఆ సినిమాకు రెండో శనివారం ఏకంగా 26.5 కోట్ల రూపాయల నెట్ వచ్చింది.

ఇప్పుడీ రికార్డ్ ను గదర్-2 అధిగమించింది. రెండో శనివారం ఈ సినిమాకు ఏకంగా 32 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. ఇది సాధారణ విషయం కాదు, రెండో శనివారంలో కూడా ఈ స్థాయి వసూళ్లు అంటే, భవిష్యత్తులో మరో సినిమాకు ఈ ఘనత సాధించడం చాలా కష్టం కావొచ్చు.

ఇక రెండో శుక్రవారం కూడా 20 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లతో గదర్-2 ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన గదర్ 2లో సన్నీ డియోల్, అమీషా పటేల్ మొదటి భాగం నుండి తమ పాత్రలను కొనసాగించారు, ఉత్కర్ష్ శర్మ, సిమ్రత్ కౌర్, మనీష్ వాధ్వా ఈ స్టార్ కాస్ట్ లోకి కొత్తగా చేరారు.

గదర్ 2లో, తారా సింగ్ (సన్నీ డియోల్) పాకిస్తాన్‌లో చిక్కుకున్న తన కొడుకు (ఉత్కర్ష్ శర్మ)ని రక్షించే పనిలో ఉంటాడు. ఈ ప్రయాణంలో అతడు ఎదుర్కొన్న ఇబ్బందులేంటి.. వాటిని తారాసింగ్ ఎలా అధిగమించాడనేది గదర్-2 స్టోరీ. మంచి కథకు, సెన్సిబుల్ స్క్రీన్ ప్లే యాడ్ చేసి తీసిన సినిమా ఇది. ఇంకా చెప్పాలంటే, ఫక్తు బాలీవుడ్ ఫార్ములాలో తెరకెక్కింది. ఇలాంటి హార్ట్ టచింగ్ స్క్రీన్ ప్లేను బాలీవుడ్ ప్రేక్షకులు మిస్సయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకూ గదర్-2 రూపంలో వాళ్లకు సిసలైన బాలీవుడ్ సినిమా దొరికింది. అందుకే ఇంత పెద్ద హిట్టయింది.

Advertisment
తాజా కథనాలు