ఘనంగా ప్రారంభమైన అయ్యప్పస్వామి ద్వితీయ పుష్కర కుంభాభిషేకం..!!

భూతనాథ సదానందాః సర్వభూత దయాపర రక్షరక్ష మహాబాహో.. శాస్తేతుభ్యం నమోనమః... పిలిస్తే పలికే కలియుగ వరదుడు, శ్రీ హరిహరపుత్రుడు అయ్యప్పస్వామి కుంభాభిషేకం బుధవారం అత్యంత ఘనంగా ప్రారంభం అయ్యింది.

New Update
ఘనంగా ప్రారంభమైన అయ్యప్పస్వామి ద్వితీయ పుష్కర కుంభాభిషేకం..!!

భూతనాథ సదానందాః సర్వభూత దయాపర రక్షరక్ష మహాబాహో.. శాస్తేతుభ్యం నమోనమః... పిలిస్తే పలికే కలియుగ వరదుడు, శ్రీ హరిహరపుత్రుడు అయ్యప్పస్వామి కుంభాభిషేకం బుధవారం అత్యంత ఘనంగా ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ సమూహంలో ఉన్న అయ్యప్ప స్వామి ద్వితీయ పుష్కర కుంభాభిషేక మహోత్సవానికి వేదపండితుల మంత్రోచ్చరణ నడుమ అంకురార్పణ జరిగింది.

సూరపనేని సునంద్, పద్మప్రియ దంపతులచే సుందరంగా పునర్నవీకరించిన దేవాలయంలో తుని తపోవన పీఠాధ్వీరులు శ్రీశ్రీశ్రీ సద్గురు సచ్చిదానంద సరస్వతీ మహాస్వామివారి కరకములములచే పూజాకార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో మొదటిరోజులో భాగంగా గోపూజ, ఆలయ ప్రదక్షణ, యాగశాల ప్రదక్షణ, శాలాంగ బలి, గణపతిపూజ, పంచగవ్యప్రాశన, బుుత్విక్ వరుణలు, దీక్షా వస్త్రములు, అఖండ స్థాపన, తోపాటు పలు హోమాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్, సిహెచ్ రామయ్య, ఈవో శ్రీమతి ఎన్ లావణ్య, అలయ ప్రధాన అర్చకులు జొన్నలగడ్డ శ్రీనివాస్ శర్మ, దేవాలయ కమిటీ, అర్ఛకులు సిబ్బంది పాల్గొన్నారు.

publive-imagepublive-imagepublive-image

Advertisment
తాజా కథనాలు