Ayyannapatrudu: శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు నామినేషన్‌

AP: శాసనసభ స్పీకర్‌గా చింతకాలయ అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. అయ్యన్నపాత్రుడు తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

New Update
Ayyannapatrudu: శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు నామినేషన్‌

Ayyannapatrudu: శాసనసభ స్పీకర్‌గా చింతకాలయ అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. అయ్యన్నపాత్రుడు తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు అసెంబ్లీలో స్పీకర్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.

మంత్రి పదవి రాకపోవడంతో..

మంత్రివర్గంలో చోటు దక్కని చింతకాయల అయ్యన్నపాత్రుడికి కీలక పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన్ను ఏపీ స్పీకర్‌గా నియమించేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు. అలాగే ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన జనసేనకు డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మండలి బుద్ధప్రసాద్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌, లోకం మాధవి పేర్ల చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఒకరిని డిప్యూటీ స్పీకర్‌ పదవి వరించే అవకాశం ఉంది. జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో చీప్‌విఫ్‌గా దూళిపాళ్ల నరేంద్ర పేరు పరిశీలనలో ఉంది.

Advertisment
తాజా కథనాలు