/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-13-at-7.40.26-PM-e1718708336455.jpeg)
Ayyanna Patrudu: ఈ నెల 24న తాను అసెంబ్లీ స్పీకర్ (AP Assembly Speaker) అవుతానన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం (Narsipatnam) నియోజకవర్గంలో ఆరిలోవ అటవీ ప్రాంతంలో మున్సిపాలిటీ, ఆర్ ఎం బి రోడ్లను సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. తప్పు చేసిన అధికారులను, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులను వదలిపెట్టమని హెచ్చరించారు.
నాణ్యత లేనందున..
అనంతరం, నాణ్యత పరిణామాలకై, క్వాలిటీ అధికారుల వద్ద నుండి స్పష్టమైన వివరణ రాకపోవడంతో అయ్యన్న అసహనం వ్యక్తం చేశారు. ఎలక్షన్ లో ఓట్ల కోసం అర్థరాత్రి రోడ్డు పనులు చేసారు కదా అని ఆర్ అండ్ బి అధికారులు నిలదీశారు. అయితే ఈ పనులలో నాణ్యత లేనందున బిల్లులు చేయకూడదని ఆదేశించారు.
Also Read: ముగ్గురుతో ప్రేమాయణం.. పెళ్లి చేసుకోమన్నాడని కన్నతండ్రిని చంపిన కూతురు ఘటనలో షాకింగ్ విషయాలు..!
అయ్యన్న ఆగ్రహం..
2017 సంవత్సరంలో తాను R&B మంత్రిగా ఉన్నప్పుడు గొలుగొండ మండలం కృష్ణదేవిపేట నుండి నర్సీపట్నం మార్గంలో 26 కిలోమీటర్లకు ఒక్కొక్క కిలోమీటర్ కు కోటి రూపాయలు చొప్పున నిధులు విడుదల చేశానన్నారు. ఆ నిధులతో 7 సంవత్సరాలుగా ఆర్ఎం బి రోడ్డు పనులు జరుగుతున్నాయన్నారు. ఈ రోజు పరిశీలించగా నాణ్యత పాటించకుండా అసంపూర్ణంగా సాగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హెచ్చరిక..
ఈ పనులపై పూర్తి నివేదిక ఒక వారం రోజుల్లో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎంక్వయిరీ నిర్వహించి, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి, తాను అసెంబ్లీ స్పీకర్ గా చట్టసభలో నియమితులైన మరుక్షణమే సభాముఖంగా సంబంధించిన అధికారులు వివరణ ఇవ్వవలసి వస్తుందని హెచ్చరించారు.