/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-85-jpg.webp)
Foods Causing Hair Fall: జుట్టు రాలిపోవడం చాలా మందిలో కనిపించే సహజమైన సమస్య. జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉండడానికి సరైన పోషకాహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. దాంతో పాటు జుట్టు రాలిపోవడానికి కారణమయ్యే కొన్ని ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. ఈ ఆహారాలను తీసుకుంటే జుట్టు రాలే సమస్య మరింత ఎక్కువవుతుంది.
జుట్టు రాలడానికి కారణమయ్యే ఆహారాలు
రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్
అతిగా శుద్ధి చేసిన ఆహారాల్లో పోషకాహారాలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు పాస్తా, వీట్ బ్రేడ్, పిజ్జా, వంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆహారంలో పోషకాల విలువలు తగ్గుతాయి. సరైన పోషణ లేకపోవడంతో జుట్టు పెరుగుదల కూడా తగ్గిపోతుంది. అంతే కాదు జుట్టు రాలే సమస్య కూడా ఎక్కువవుతుంది.
కార్బోనేటేడ్ డ్రింక్స్
కార్బోనేటేడ్ డ్రింక్స్ సోడా, పెప్సీ, వంటి డ్రింక్స్ ఎక్కువగా తాగితే జుట్టు బలహీనంగా మారుతుంది. ఇవి తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవ్వడం జరుగుతుంది. దీని వల్ల హెయిర్ ఫాలికల్స్ బలహీనమవుతాయి. ఇది జుట్టు పెరుగుదలకు భంగం కలిగించును.
షుగర్ ప్రాడక్ట్స్
షుగర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యంతో పాటు జుట్టు పెరుగుదల పై కూడా ప్రభావం చూపుతుంది. అధిక చక్కర శరీరంలో ప్రోటీన్ శోషణను తగ్గిస్తుంది. దీని వల్ల జుట్టుకు కావాల్సిన సరైన పోషకాలు అందకపోవడంతో జుట్టు బలహీనంగా మారి.. హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువవుతుంది.
విటమిన్ A సప్లిమెంట్స్
విటమిన్ A సప్లిమెంట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ విటమిన్ A ఎక్కువగా తీసుకుంటే అది జుట్టు రాలడానికి కారణమవుతుంది. దీనిలోని రెటినాల్ జుట్టు పెరుగుదలకు కారణమయ్యే సేబాషియస్ గ్లాండ్స్ పని తీరు పై ప్రభావం చూపుతుంది. దీని వల్ల జుట్టు రాలే సమస్య తీవ్రమవుతుంది.
ఎగ్ వైట్
గుడ్డులోని తెల్ల సోనా తింటే జుట్టు త్వరగా రాలిపోతుంది. ఇది శరీరంలో బయోటీన్ లోపాన్ని కలిగిస్తుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యానికి, దృఢత్వానికి తోడ్పడే కెరోటీన్ ఉత్పత్తి పై ప్రభావం చూపుతుంది. అందుకే జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది.
మెర్క్యురీ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు
కొన్ని చేపల్లో మెర్క్యురీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే జుట్టు రాలిపోయే సమస్య వస్తుంది. అంతే కాదు నిద్రలేమి, నీరసం, డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలకు కూడా కారామవుతుంది.
Also Read: Health Tips: దాల్చిన చెక్కతో మధుమేహానికి చెక్.. ఎలానో తెలుసా?