Summer Tips: వేసవిలో కూడా మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సులభమైన ఈ పద్దతులను పాటించాల్సిందే. అవేంటో తెలుసుకుందాం.
హైడ్రేట్ గా ఉండాలి:
రోజంతా నీరు త్రాగడం ముఖ్యం. క్రమం తప్పకుండా నీరు తాగుతుండాలి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ తీసుకోవాలి. ఈ ద్రవాలన్నీ శరీరంలో డీహైడ్రేషన్‌ను నివారిస్తాయి.తద్వారా మీరు శక్తివంతంగా ఉంటారు.
స్పైసీ ఫుడ్ కు దూరంగా:
ఆయిల్, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్ణం వస్తుంది. ఈ సీజన్‌లో లభించే ఆకుపచ్చని కూరగాయలు, పండ్లను ఎక్కువగా తినండి. పుచ్చకాయ, దోసకాయ, మామిడి మొదలైనవి తినడం మర్చిపోవద్దు.
చల్లనినీరు తాగకూడదు:
కొంతమంది బయటి నుంచి రాగానే ఫ్రిజ్‌లో ఉంచిన నీటిని తాగుతారు. దీనివల్ల గొంతు నొప్పి, జలుబు వస్తుంది. ఫ్రిజ్ నుండి చల్లని నీరు త్రాగడానికి ముందు ఒక గ్లాసు సాధారణ నీరు త్రాగాలి. అప్పుడు మీరు రసం, మజ్జిగ, కొబ్బరి నీరు త్రాగవచ్చు.
చెమట:
వేసవిలో చెమటలు ఎక్కువగా పడుతుంటాయి కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకోవడం మర్చిపోవద్దు. చెమటతో కూడిన దుస్తులు ధరించడం వల్ల చర్మంపై బ్యాక్టీరియా వృద్ధి చెంది చర్మ సంబంధిత సమస్యలకు కారణమవుతుంది.
వ్యాయామం:
కొంతమంది ఎక్కువ ఒత్తిడి కారణంగా వ్యాయామం చేయడం మానేస్తారు, కానీ అలా చేయోద్దు. తెల్లవారుజామున చలిగాలులు వీస్తుంటాయి. అప్పుడు పార్క్, గార్డెన్ లేదా టెర్రస్‌కి వెళ్లి యోగా, ధ్యానం చేయండి. శరీరంలో ఎనర్జీ లెవెల్స్‌ని మెయింటెయిన్ చేయడానికి తేలికపాటి వ్యాయామం చేయండి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వాకింగ్, జాగింగ్, సైకిల్ తొక్కడం మానుకోండి.