Summer Tips: వేసవిలో ఈ 5 తప్పులు చేస్తే ఆరోగ్యం పాడవుతుంది జాగ్రత్త! ఎండలు ముదురుతున్నాయి. వడదెబ్బ అనేక అనారోగ్య సమస్యలను పెంచుతుంది. హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్, తలనొప్పి, స్కిన్ ట్యాన్ మొదలైన సమస్యలు వస్తాయి. కొంచెం అజాగ్రత్తగా అనారోగ్యానికి దారి తీస్తుంది. ఎండా కాలంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. By Bhoomi 28 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Summer Tips: వేసవిలో కూడా మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సులభమైన ఈ పద్దతులను పాటించాల్సిందే. అవేంటో తెలుసుకుందాం. హైడ్రేట్ గా ఉండాలి: రోజంతా నీరు త్రాగడం ముఖ్యం. క్రమం తప్పకుండా నీరు తాగుతుండాలి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ తీసుకోవాలి. ఈ ద్రవాలన్నీ శరీరంలో డీహైడ్రేషన్‌ను నివారిస్తాయి.తద్వారా మీరు శక్తివంతంగా ఉంటారు. స్పైసీ ఫుడ్ కు దూరంగా: ఆయిల్, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్ణం వస్తుంది. ఈ సీజన్‌లో లభించే ఆకుపచ్చని కూరగాయలు, పండ్లను ఎక్కువగా తినండి. పుచ్చకాయ, దోసకాయ, మామిడి మొదలైనవి తినడం మర్చిపోవద్దు. చల్లనినీరు తాగకూడదు: కొంతమంది బయటి నుంచి రాగానే ఫ్రిజ్‌లో ఉంచిన నీటిని తాగుతారు. దీనివల్ల గొంతు నొప్పి, జలుబు వస్తుంది. ఫ్రిజ్ నుండి చల్లని నీరు త్రాగడానికి ముందు ఒక గ్లాసు సాధారణ నీరు త్రాగాలి. అప్పుడు మీరు రసం, మజ్జిగ, కొబ్బరి నీరు త్రాగవచ్చు. చెమట: వేసవిలో చెమటలు ఎక్కువగా పడుతుంటాయి కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకోవడం మర్చిపోవద్దు. చెమటతో కూడిన దుస్తులు ధరించడం వల్ల చర్మంపై బ్యాక్టీరియా వృద్ధి చెంది చర్మ సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. వ్యాయామం: కొంతమంది ఎక్కువ ఒత్తిడి కారణంగా వ్యాయామం చేయడం మానేస్తారు, కానీ అలా చేయోద్దు. తెల్లవారుజామున చలిగాలులు వీస్తుంటాయి. అప్పుడు పార్క్, గార్డెన్ లేదా టెర్రస్‌కి వెళ్లి యోగా, ధ్యానం చేయండి. శరీరంలో ఎనర్జీ లెవెల్స్‌ని మెయింటెయిన్ చేయడానికి తేలికపాటి వ్యాయామం చేయండి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వాకింగ్, జాగింగ్, సైకిల్ తొక్కడం మానుకోండి. ఇది కూడా చదవండి: పుట్టపర్తి గడ్డ..టీడీపీ అడ్డ..భారీ మెజార్టీతో గెలుపు ఖాయమంటున్న పల్లె సింధూర రెడ్డి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..! #summer-tips #better-health #five-habits మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి