author image

Trinath

China-Pak vs India: చైనా ఆయుధాలతో పాక్‌ ఉగ్రవాదుల బరితెగింపు.. మొత్తం చేస్తుంది డ్రాగనేనా?
ByTrinath

జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు చైనా ఆయుధాలు, బాడీసూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగించి భారత్‌ సైన్యంపై దాడి చేస్తున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఉగ్రవాదులు ఉపయోగించే ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ పరికరాలు కూడా చైనావేనని సమచారం.

Kashmir: 'గాజాకు పట్టిన గతే కశ్మీర్‌కు పడుతుందా'? చర్చలేవి?
ByTrinath

కశ్మీర్‌ సమస్యలను పాకిస్థాన్‌తో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. అలా చేయకపోతే గాజా, పాలస్తీనాలకు పట్టిన గతే మనకూ పడుతుందని హెచ్చరించారు.

TTD News: వారికి జీతాలు పెంపు.. ఉద్యోగులపై టీటీడీ  వరాల వర్షం!
ByTrinath

ఇంటి స్థలాలు పంపిణీ, జీతాల పెంపు లాంటి నిర్ణయాలతో ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. కల్యాణ కట్ట పీస్ రేట్ క్షురకులకు నెలకు రూ.20వేల వేతనం ఇవ్వాలని నిర్ణయించారు.

Rohit Sharma: అతను లేకపోవడం పెద్ద లోటు.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు రోహిత్‌ ఏం అన్నాడంటే?
ByTrinath

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు డిసెంబర్‌ 26న(రేపు) జరగనుండగా.. రెండో టెస్టు జనవరి 3న జరగనుంది. ఈ రెండు టెస్టులకు షమీ అందుబాటులో ఉండడంలేదు. కుడి పాదం నొప్పితో షమీ బాధపడుతున్నాడు. ఈ స్టార్ పేసర్ లేకపోవడం లోటేనని రోహిత్‌శర్మ చెప్పుకొచ్చాడు.

Criminal Laws: అమల్లోకి మూడు క్రిమినల్‌ చట్టాలు... బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం!
ByTrinath

మూడు క్రిమినల్ చట్ట సవరణ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా చట్టాలు అమల్లోకి వచ్చాయి. డిసెంబర్ 21, డిసెంబర్ 20న ఈ చట్టాలకు రాజ్యసభ, లోక్‌సభలో ఆమోదం లభించింది.

Anti Terror Operations : షాకింగ్‌ న్యూస్‌.. పూంచ్‌లో పౌరుల మరణాల వెనుక ఆర్మీ బ్రిగేడియర్?
ByTrinath

పూంచ్‌లో పౌరుల మరణాలపై దర్యాప్తులో భాగంగా ఆర్మీ బ్రిగేడియర్ స్థాయి అధికారిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అతను బాధ్యతలు నిర్వహిస్తున్న పరిధిలోనే ఉగ్రవాద చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆర్మీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అటు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పూంచ్ సెక్టార్‌ను సందర్శించారు.

Man Thrashes Mother: కరెంట్‌ పోల్‌కి కట్టేసి తల్లిని కొట్టిన కొడుకు.. ఇంత దారుణమా?
ByTrinath

ఒడిశా కియోంజర్ జిల్లాలోని సరస్పసి గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. తన వ్యవసాయ భూమిలో క్యాలీఫ్లవర్‌ను చోరీ చేసిందన్న అనుమానంతో ఓ తల్లి(70)ని ఆమె కుమారుడు కొట్టి, విద్యుత్ స్తంభానికి కట్టేశాడు. ఈ గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించిన గ్రామస్థులను శతృఘ్న బెదిరించాడు.

Corona December Link: డిసెంబర్‌లోనే కొత్త వేరియంట్లు ఎందుకు వ్యాప్తి చెందుతాయి? కరోనాతో ఈ నెలకు ఉన్న బంధమేంటి?
ByTrinath

2020 డిసెంబర్‌లో డెల్టా వేరియంట్‌ తన ఉనికిని చాటుకుంటే.. 2021 డిసెంబర్‌లో ఒమిక్రాన్‌ కోరలు చాచింది. ఇక ఈ డిసెంబర్‌లో JN.1 వేరియంట్‌ భయపెడుతోంది. నేచర్ జర్నల్‌ అధ్యయనాల ప్రకారం చల్లని వాతావరణ పరిస్థితులు వైరస్ వ్యాప్తిని పెంచుతాయి. అందుకే డిసెంబర్‌లో ముందుగా కేసుల హైక్ కనిపిస్తుంది.

Advertisment
తాజా కథనాలు