author image

Trinath

Under-19 WC: సచినే హీరో.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా!
ByTrinath

కెప్టెన్‌ ఉదయ్‌, సచిన్‌ సెంచరీలతో విజృంభించడంతో యువభారత నేపాల్‌పై భారీ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్‌ విజయంతో టీమండియా అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్ మ్యాచ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ గెలవడం విశేషం. ఆరు పాయింట్లతో పాటు నెట్‌రన్‌రేట్‌ +3.240గా ఉంది.

Job Mela: నిరుద్యోగులకు అలెర్ట్.. 5వేల జాబ్స్‌కు ఇవాళ ఖమ్మంలో మెగా జాబ్‌ మేళా!
ByTrinath

ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఫిబ్రవరి 3న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో 65 కంపెనీలు పాల్గొంటాయి. సుమారు 5,000 పైగా ఉద్యోగాలు కల్పించనున్నాయి. రిజిస్ట్రేషన్‌ల కోసం హెల్ప్‌లైన్ నంబర్‌లు 8886711991, 9642333668లను సంప్రదించండి.

Siddham: నేడు దెందులూరులో జగన్‌ 'సిద్ధం'.. ఆ జిల్లాలో అతి పెద్ద రాజకీయ బహిరంగ సభ అవుతుందా?
ByTrinath

ఏలూరులో వైసీపీ ఎన్నికల సన్నాహక రెండో సభ ఇవాళ జరగనుంది. ఏలూరు నగర శివారు ఆటోనగర్‌ సమీపంలో, దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు దాదాపు 5లక్షల మంది వస్తారని అంచనా. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం సభ ప్రారంభమవుతుంది.

Morning Health: నిద్రలేచిన వెంటనే మొబైల్ చూస్తే ఏం అవుతుందో తెలుసుకుంటే మళ్లీ ఆ పని చేయరు!
ByTrinath

మార్నింగ్‌ నిద్రలేవగానే స్మార్ట్‌ఫోన్‌ని చూడడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. నిద్ర లేచిన గంటలోపు అదే పనిగా ఫోన్‌ని చెక్‌ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళనతో పాటు మీ అమూల్యమైన టైమ్ వేస్ట్ అవుతుంది. మైండ్ డైవర్ట్ అవుతుంది. దీనికి బదులుగా వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం, బుక్స్ చదవడం, జర్నలింగ్, పాడ్ కాస్ట్‌ను వినడం, పాటలు వినడం లాంటివి చేయండి.

Solar Roof Top Policy: రూఫ్‌టాప్‌ సోలార్‌ పాలసీ సబ్సిడి పొందడం ఎలా..?
ByTrinath

రూఫ్‌టాప్‌ సోలార్‌ పాలసీ సబ్సిడి పొందడం ఎలా..? రూఫ్‌టాప్‌ సోలార్‌ పాలసీతో ఎన్ని ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారు? రూఫ్‌టాప్‌ సోలార్‌ పాలసీలో ఎన్ని కేటగిరిలున్నాయి? దీనిపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి.

Interim Budget: రైతులకు నిరాశ మిగిల్చిన మధ్యంతర బడ్జెట్!
ByTrinath

మధ్యంతర బడ్జెట్‌లో పీఎం కిసాన్‌ నిధుల పెరుగుదల ఉంటుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. ప్రపంచంలోనే అతిపెద్ద DBT పథకాలలో ఇది ఒకటి. 2019 మధ్యంతర బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించారు. పథకం కింద కేంద్రం 3నెలవారీ వాయిదాలలో ఏడాదికి రూ. 6వేల ప్రయోజనాన్ని ఇస్తుంది.

Budget 2024 Live Updates🔴: మధ్యంతర బడ్జెట్‌.. కీ హైలెట్స్!
ByTrinath

అందరిచూపు మధ్యంతర బడ్జెట్‌వైపే.. ఎన్నికలకు ముందు బడ్జెట్‌ కావడంతో కేంద్రం మధ్యతరగతి ప్రజలకు గుడ్‌న్యూస్‌ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యంతర బడ్జెట్‌పై మినిట్‌ టు మినిట్‌ అప్‌డేట్స్ ఇస్తోంది ఆర్టీవీ.

Union Budget 2024 : బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందా?
ByTrinath

రానున్న బడ్జెట్‌ (2024) లో ఆదాయపు పన్ను మినహాయింపుపై ప్రజలకు చాలా తక్కువ ఆశలు ఉన్నాయని కేర్‌ రేటింగ్‌ సర్వే చెబుతోంది . ఈ అంశంపై 120 మంది ప్రముఖుల నుంచి అభిప్రాయాన్ని కోరింది సంస్థ. పన్ను మినహాయింపు ఇచ్చే ఛాన్స్ లేదని 63 శాతం మంది అభిప్రాయపడ్డారు.

Interim Budget : మధ్యంతర బడ్జెట్‌లో ప్రజలను ఆకర్షించే పథకాలు..!
ByTrinath

మధ్యంతర బడ్జెట్‌(Interim Budget) లో ప్రజలను ఆకర్షించే పథకాలను పెట్టాలని కేంద్రం నిర్ణయించుకుంది. పీఎం కిసాన్‌ సాయం పెంచనుందని ప్రచారం జరుగుతోంది. యువతను ఆకట్టుకునేందుకు స్టార్టప్ రంగానికి పన్ను మినహాయింపులు ప్రకటించే ఛాన్స్‌ ఉంది. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో ప్రధాన్యత ఇవ్వనుంది కేంద్రం.

Advertisment
తాజా కథనాలు