author image

Trinath

By Trinath

ఎన్‌ఆర్‌ఐ-ఓసీఐ భార్యాభర్తల పాస్‌పోర్ట్‌లను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయాలని లా కమిషన్‌ సిఫార్సు చేస్తోంది. NRI/OCI-భారతీయ పౌరుల మధ్య జరిగే అన్ని వివాహాలు తప్పనిసరిగా భారత్‌లో ఇకపై నమోదు చేసుకునేలా రూల్స్‌ తీసుకొస్తున్నారు. కమిషన్ ఛైర్మన్ అవస్తీ ఈ నివేదిక సమర్పించారు.

By Trinath

ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా రవిచంద్రన్ అశ్విన్ భారత టెస్టు జట్టు నుంచి వైదొలిగాడు. రాజ్‌కోట్‌ టెస్టులో ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. ఈ మూడు రోజులు అశ్విన్‌ అందుబాటులో ఉండడు. నిన్న జాక్‌ క్రావ్‌లీ వికెట్‌ ద్వారా టెస్టుల్లో అశ్విన్‌ 500వ వికెట్‌ సాధించిన విషయం తెలిసిందే.

By Trinath

ఇండియా యమహా మోటార్ తన 125 సిసి స్కూటర్ మోడళ్లకు చెందిన 3 లక్షల యూనిట్లను రీకాల్ చేసింది. స్కూటర్లో బ్రేక్ భాగాన్ని సరిచేయడానికి వీటిని రీకాల్ చేస్తున్నారు. జనవరి 1, 2022 నుంచి జనవరి 4, 2024 మధ్య తయారైన స్కూటర్లను తక్షణమే రీకాల్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.

By Trinath

SSC : 2023లో SSC భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 26,146 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా విడుదల చేశారు.

By Trinath

చంద్రబాబు దంపతులు మరోసారి రాజశ్యామల యాగం చేస్తుండడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నివాసంలో మూడు రోజులపాటు రాజశ్యామల యాగం చేస్తున్నారు. రాజశ్యామల యాగంలో చంద్రబాబు,భువనేశ్వరి దంపతులు పాల్గొన్నారు.

By Trinath

Raajadhani Files : 'రాజధాని ఫైల్స్' సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌లు, రికార్డ్‌లు సక్రమంగానే ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది.

By Trinath

తన హౌస్ కీపింగ్ నైపుణ్యాల గురించి నెగిటివ్‌ కామంట్స్ చేసిన స్నేహితురాలిపై నెబ్రాస్కాకు చెందిన మహిళ క్రూరంగా దాడి చేసింది. ఇంట్లో కుక్క మలం, చచ్చిన ఎలుక ఉండటాన్ని ప్రశ్నించిన స్నేహితురాలి ముఖంపై కత్తితో ఘోరంగా పొడిచేసింది.

By Trinath

Manipur : ఓ హెడ్‌కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌ను నిరసిస్తూ కుకీ వర్గ ప్రజలు ఎస్పీ, డీసీ కార్యాలయాల ప్రాంగణంలో వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్, బాష్పవాయువు ప్రయోగించగా ముగ్గురు నిరసనకారులు చనిపోయారు.

By Trinath

ఇవాళ్టితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. అసెంబ్లీలో కుల గణనపై ఇవాళ తీర్మానం ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలో కులగణన చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది.

By Trinath

స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి క్రిస్టియన్ ఆర్థోడాక్స్ మెజారిటీ దేశంగా గ్రీస్ నిలిచింది. 176-76 ఓట్లతో గ్రీస్‌ పార్లమెంట్‌లో స్వలింగ వివాహాలకు అనుమతించే బిల్లు ఆమోదం పొందింది. 300 మంది సభ్యులున్న పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే సాధారణ మెజారిటీ అవసరం. వామపక్ష ప్రతిపక్షాల మద్దతుతో బిల్లు పాస్ అయ్యింది.

Advertisment
తాజా కథనాలు