author image

Trinath

By Trinath

Investment : మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన పథకం కింద పెట్టుబడులు పెడితే అద్భుతమైన రాబడిని పొందవచ్చు. ఇది మహిళల కోసమే స్పెషల్‌గా ఉన్న స్కీమ్‌. ప్రస్తుతం ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు 7.5 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. ముఖ్యంగా గృహిణులకు ఇది మంచి పథకం.

By Trinath

బైజూస్‌ ఇన్వెస్టర్ల సమావేశానికి ముందు బైజూ రవీంద్రన్‌కు షాక్‌ తగిలింది. ఈ ఎడ్‌-టెక్‌ కంపెనీ వ్యవస్థపకుడిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయాలని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌ని ఈడీ కోరింది. బైజూస్‌ కంపెనీ విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన ఆరోపణలను ఎదుర్కొంటోంది.

By Trinath

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌కి కేంద్రానికి మధ్య మరోసారి వార్‌ మొదలైనట్టే కనిపిస్తోంది. వివాదాస్పద అకౌంట్లను సస్పెండ్‌ చేయాలన్న కేంద్రం ఆదేశాలకు ట్విట్టర్‌ స్పందించింది. సంబంధిత అకౌంట్లను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామని.. అయితే కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది.

By Trinath

గగన్‌యాన్‌ మిషన్‌లో ఇస్రో మరో ముందడుగు వేసింది. గగన్‌యాన్ మిషన్‌కు చెందిన CE20 క్రయోజెనిక్ ఇంజిన్ సిద్ధంగా ఉందని ట్వీట్ చేసింది. ఇస్రో చేపట్టిన గగన్‌యాన్‌ మిషన్‌ విజయవంతమైతే అమెరికా, చైనా, సోవియట్‌ యూనియన్‌ తర్వాత ఈ ఘన సాధించిన భారత్‌ నాలుగో దేశంగా అవతరిస్తుంది.

By Trinath

Railway Jobs : ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారు ఈ ఛాన్స్ మిస్‌ చేసుకోవద్దు. సదరన్ ఇండియన్ రైల్వే వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటీస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 2,860 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 29న దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది.

By Trinath

Kothapalli Subbarayudu : జనసేనలోకి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వెళ్లనున్నారు. ఆయన్ను గతంలో వైసీపీ తన పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరున విజయవాడలో పవన్ సమక్షంలో చేరనున్నారు. రానున్న ఎన్నికల్లో నరసాపురం నుంచి ఆయన జనసేన టిక్కెట్‌పై పోటీ చేయవచ్చని సమాచారం.

By Trinath

ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది, దేశ మాజీ ASG నారిమన్ (95) ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఇందిరా ప్రభుత్వ హయాంలో ఆయన దేశ అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ)గా ఉన్నారు. 1991లో నారిమన్‌కు పద్మభూషణ్‌ పురస్కారం లభించింది. ఆయనకు న్యాయవాదిగా 70 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

By Trinath

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన తొలిసారి తన నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.3,961 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

By Trinath

క్రాసులా మొక్కను ఆఫీస్‌ లేదా షాప్‌ క్యాష్ కౌంటర్ వద్ద పెట్టుకుంటే రెట్టింపు లాభాలు వస్తాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. అటు ఉసిరి మొక్కకు క్రమం తప్పకుండా నీరు ఇవ్వడం వల్ల బాధలు తొలగిపోయి సంపద లభిస్తుందట.

Advertisment
తాజా కథనాలు